షర్మిల కోసమేనా ఇంతటి త్యాగం..!

Gidugu Rudra Raju

అందరు సంక్రాంతి పండుగకు ఎదో ఒక రూపంలో గిఫ్ట్ తీసుకోవాలని ఆశపడుతుంటే ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాత్రం గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టున్నారు. సొంత పార్టీతో రాజకీయ ప్రయాణం చేయలేక కాంగ్రెస్ గూటికి చేరుకున్న వైస్ షర్మిలకు ఈ సంక్రాంతి తరువాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అయితే, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు నిర్వహిస్తున్న గిడుగు రుద్రరాజు తన పీసీసీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు పంపారు. దీనితో ఏపీలో వైస్ షర్మిల ఎంట్రీకి కాంగ్రెస్ అధిష్టానం లైన్ క్లియర్ చేసినట్లయింది. తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల చేసిన త్యాగాన్ని గుర్తించి, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ అధిష్టానం ప్రేమాభిమానాన్ని, గిడుగు చేసిన త్యాగాన్ని షర్మిల గుర్తుంచుకుంటారా..?

ADVERTISEMENT

అలాగే “బంధాని కన్నా బాధ్యతకే” కట్టుబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఏపీలో షర్మిల నిలబెడతారా..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానము చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories