పైరసీ చేస్తోన్న ధియేటర్ సీజ్!

Gomathi Movie Theatre Siezed On Piracy Case -ఏదైనా సినిమా విడుదలైన రోజే హెచ్డీ క్వాలిటీతో పైరసీని విడుదల చేసేందుకు సహకరిస్తుందని చానాళ్లుగా ఆరోపణలున్న తమిళనాడు, కడలూరులోని గోమతి థియేటర్ ఎట్టకేలకు మూతపడింది. ఇటీవలి కాలంలో పైరసీ సీడీల విక్రయాలు పెరిగిపోగా, ‘ఒరు కుప్పై కథై’ చిత్ర నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కదిలారు.

తాము విదేశీ హక్కులను విక్రయించలేదని, కానీ సినిమా పైరసీ బయటకు రావడంతో నష్టపోయామని నిర్మాతలు ఫిర్యాదు చేశారు. దీంతో గోమతి థియేటర్ లో ఈ పైరసీ సీడీలను ఆధునిక టెక్నాలజీ సాయంతో తయారు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. అక్కడే పైరసీ సీడీలు తయారు చేస్తున్నట్టు తేలడంతో థియేటరును సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశామని, పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories