
శాసనసభలో ఏవైనా బిల్లులు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర పడితే అవి చట్టరూపం దాల్చుతాయి. సాధారణంగా గవర్నర్లు ఆమోదముద్ర వేస్తుంటారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య లేదా గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం మద్య ఘర్షణ ఏర్పడినప్పుడు వాటికి గవర్నర్ వద్ద బ్రేకులు పడుతుంటాయి.
తమిళనాడులో ఇదే జరుగుతోంది. సిఎం స్టాలిన్ కేంద్రంపై కత్తులు దూస్తుండటంతో ఆయన ప్రభుత్వం ఆమోదించి పంపిన పది బిల్లులు గవర్నర్ వద్ద ఆగిపోయాయి. అప్పుడు స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో అనూహ్యమైన తీర్పు వెలువరించింది.
Also Read – AI విప్లవం – విజ్ఞానమా? వినాశనమా?
“రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులని తిరస్కరించడానికి, రాష్ట్రపతికి పంపించి అభిప్రాయం కోరడానికి గవర్నర్లకు అధికారం ఉంటుంది. కానీ ఆ పేరుతో వాటిని ఎల్లకాలం తమ వద్దే అట్టేబెట్టుకుంటే కుదరదు. పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఇదే వర్తిస్తుంది.
ఒకవేళ గవర్నర్ వాటికి ఆమోదం తెలుపకుండా, తిరస్కరించకుండా అట్టే బెట్టుకుంటే, నిర్దిష్ట కాలం తర్వాత వాటికి ఆమోదం తెలిపిన్నట్లే భావించి రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకు రావచ్చు.
ఈ అంశంపై న్యాయ సమీక్ష చేసేందుకు సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. కనుక ఇకపై గవర్నర్లు బిల్లులు ఆమోదించకుండా తొక్కిపెట్టి ఉంచితే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు,” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఏ రాష్ట్రంలో గవర్నర్లు బిల్లులు తొక్కి పట్టి ఉంచలేరు. కనుక ఈ తీర్పుని ప్రాంతీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. అయితే ఇది మంచిదా కాదా? అంటే రెండు ఉదాహరణలు పరిశీలించాల్సి ఉంటుంది.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
1. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కానీ జగన్ ప్రభుత్వం గవర్నర్‌కి మాట మాత్రంగా చెప్పకుండానే అరెస్ట్ చేయించింది. సరిగ్గా
ఇదే పాయింట్ మీద సుప్రీంకోర్టులో వాదోపవాదాలు సాగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ‘గవర్నర్ పాత్ర’ గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇక్కడ గవర్నర్
అవసరం ఉందని, ఇటువంటి సమయంలో ఆయన రాజ్యాంగ రక్షకుడుగా వ్యవహరించి ప్రభుత్వం గాడి తప్పకుండా కాపాడగలరని స్పష్టమవుతోంది.
2. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ నేతలని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని సిఫార్సు చేశారు. కానీ ఆ సమయంలో కేసీఆర్ అటు కేంద్రంతో, ఇటు గవర్నర్ తమిళసైతో
యుద్ధాలు చేస్తున్నారు. కనుక ఆమె తిరస్కరించారు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు వెంటనే ఆమోదముద్ర వేశారు. అంటే గవర్నర్ విచాక్షణాధికారం ప్రశ్నార్ధకంగా ఉందన్న మాట!
తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో మళ్ళీ రాజ్యాంగంలో ‘గవర్నర్ పాత్ర-పరిధి’ గురించి మళ్ళీ చర్చ జరిగింది. గవర్నర్ పరిధిని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఇది వేరే విషయం.
కానీ మన రాజకీయ వ్యవస్థలో ప్రమాణాలు, నైతిక విలువలు నానాటికీ దిగజారిపోతున్నప్పుడు, అధికారంలో ఉన్నవారు అవినీతి, అక్రమాలకు తెగబడుతున్నప్పుడు, అధికార పార్టీలు తమకు రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ధి కలిగించే విదంగా చట్టాలు చేసుకుంటే?
తమ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీసేవిదంగా చట్టాలు చేస్తే?గవర్నర్ ప్రమేయం, ఆమోదం లేకుండా వాటిని అమలుచేస్తే?
వాటి వలన నష్టం జరిగిపోయేలోగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అడ్డుకోగలవా?అడ్డుకోలేకపోతే పరిస్థితి ఏమిటి?