జబ్బలు చరుచుకో… కానీ ముందిది చూడు!

Govt Schools APఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జగనన్న విదేశీ విద్యాదీవెన పధకానికి నిధులు విడుదల చేసి మరోసారి తమ ప్రభుత్వం గొప్పదనం చెప్పుకొని భుజాలు చరుచుకొన్నారు. దేశంలో నిరుపేద విద్యార్థుల కూడా విదేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని చెప్పుకొన్నారు.

అయితే పక్కనే తెలంగాణ ప్రభుత్వంతో సహా పలు రాష్ట్రాలలో కూడా వేర్వేరు పేర్లతో ఈ పధకం అమలవుతూనే ఉందని అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే విదేశాలలో చదువుకొనేందుకు ఆర్ధికసాయం అందజేసేవారమని ఇక నుంచి బీసీలకు కూడా అందజేస్తామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ మొన్ననే ప్రకటించారు కూడా.

ADVERTISEMENT

ఈ ఒక్క పధకమే కాదు. ఏపీలో అమలుచేస్తున్న అన్ని పధకాలతో పాటు అదనంగా దళిత బంధు, గిరిజనబంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి భారీ పధకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది. కనుక సంక్షేమ పధకాల విషయంలో కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీ ప్రభుత్వమే వెనుకబడిందని చెప్పవచ్చు.

అయితే ఏపీ కంటే చాలా భారీ సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నప్పటికీ ఈ ఏడాది మార్చి నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పు రూ.3,66,306 కోట్లు ఉండగా ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లు ఉందని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. అంటే సంక్షేమ పధకాలలో కూడా జగన్‌ ప్రభుత్వం వెనుకబడినప్పటికీ అప్పులు చేయడంలో తెలంగాణ కంటే చాలా ముందే ఉందని స్పష్టమవుతోంది.

విదేశీ విద్య గురించి మాట్లాడుకొనే ముందు రాష్ట్రంలో స్వదేశీ విద్య ఏవిదంగా ఉందో ఓసారి చూడాల్సిందే. నాడు నేడు పేరుతో వైసీపీ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దామని, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్, వాటిలో బైజూస్ ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది.

కానీ నేటికీ రాష్ట్రంలో చాలా పాఠశాలలో సరైన తరగతి గదులు లేవు. దీంతో ఒకే గదిలో నాలుగైదు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో కొన్ని పాఠశాలలో పెచ్చులూడి పడుతున్నాయి! మరికొన్ని పాఠశాలలో తరగతి గదుల్లోకి వర్షం నీరు చేరుతుండగా, పైన రేకులు పగిలిపోవడంతో పైనుంచి కూడా నీళ్ళు పడుతుండటంతో విద్యార్థులు గొడుగులు వేసుకొని కూర్చోన్న ఈ దృశ్యం చూస్తే జగన్‌ విద్య ఎంత మిధ్యో అర్దం అవుతుంది.

ప్రాధమిక పాఠశాల స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా విదేశాలలో చదివిస్తున్నామని జబ్బలు చరుచుకోవడం సిఎం జగన్మోహన్ రెడ్డికే చెల్లునేమో?

ADVERTISEMENT
Latest Stories