మోషన్ పిక్చర్ టాక్ – మంచు హీరో అదరగొట్టాడు!

gunturodu-movie-motion-picture-public-talk‘ఒక్క హిట్టు కోసం’ అంటూ మంచు మనోజ్ చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నాడు. దశరథ్ దర్శకత్వం వహించిన ‘శౌర్య’ అయినా ఆ ముచ్చట తీరుస్తుందని భావించగా, అది కూడా నిరాశగానే ముగియడంతో తన తదుపరి చిత్ర “గుంటూరోడు” పైనే దృష్టి కేంద్రీకరించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పిక్చర్ ను విడుదల చేసారు.

“భూమ్మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావ” అంటూ మంచు మనోజ్ వేసిన డైలాగ్ ఆకట్టుకుంటుండగా, శ్రీ వసంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పిక్చర్ ను బాగా ఎలివేట్ చేసింది. ఓ పక్కన వర్షం పడుతున్నట్లు, మరో పక్కన ఆయుధంతో నిల్చున్న మంచు మనోజ్ స్టిల్ ను బాగా డిజైన్ చేసారు. ‘లవ్ లో పడ్డాడు’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ “గుంటూరోడు” ద్వారా అయినా ఈ మంచు హీరో మాంచి హిట్ కొడతాడేమో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories