శ్రీకాకుళంకు కేంద్రం మొండి చేయ్యికి బీజేపీ సమర్ధన

GVL Narasimha Rao comments on  Chandrababu naiduవారానికి నాలుగు సార్లు మీడియా ముందుకు వచ్చి టీడీపీ గవర్నమెంట్ పై విమర్శలు చెయ్యడం పరిపాటు అయ్యింది బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుకు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అవినీతి ఏపీలో ఉందని ఆరోపించారు. ప్రజలను దారి మళ్లించడానికే చంద్రబాబు తుఫాన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ఆయన.

[m9ad]

ADVERTISEMENT

ప్రతి రాష్ట్రంలోనూ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఉంటుందని… ఈ ఫండ్‌లో కేంద్ర నిధులు 90 శాతం ఉంటాయన్నారు. వాటిని ఎందుకు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారాయన. కేంద్రం నుంచి నిధులు రావాలి… వాటిని కొట్టేయాలనే భావనే ప్రభుత్వంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించిన జీవీఎల్… కేంద్రానికి సంబంధించిన డిజాస్టర్ ఫండ్ దేని గురించి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ”

ఒకవేళ జీవీఎల్ చెప్పేది నిజమే అనుకుంటే గతంలో ఎప్పుడు కేంద్రం విపత్తుల సమయంలో నిధులు ఇవ్వలేదా? మరి ఆ రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లేదా? గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కొంత చిల్లర వేశారు కదా? అప్పుడు టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఈ రూల్స్ ఏమీ గుర్తు రాలేదా?

ADVERTISEMENT
Latest Stories