అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుండి జరుగుతున్న ఐటీ దాడులను బీజేపీ నాయకులు సమర్ధించుకుంటున్నారు. పైగా ఎదురుదాడి చేస్తున్నారు. “ఏపీలో కొంతమంది పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే తెలుగు దొంగల పార్టీ ఉలిక్కిపడింది. ప్రజల సమస్యల గురించి చంద్రబాబు ఏనాడు కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదు.. కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలని మీటింగ్ పెట్టడం సిగ్గుచేటు,” అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
[m9ad]
“టీడీపీ అంటే రాజకీయ పార్టీనా లేక మాఫియా పార్టీనా? అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలో ఉంది. ఎంత దొరికితే అంత దోచుకుందాం.. దొరక్కుండా పారిపోదాం అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది,” అని ఆయన విమర్శించారు. ఇదంతా బానే ఉంది మరి అదే మాఫియా పార్టీతో బీజేపీ నాలుగున్నర ఏళ్ళు సంసారం చేసింది కదా?
ఎన్డీయే నుండి బయటకు వచ్చిన ఏడెనిమిది నెలలోనే అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలోకి వెళ్లిపోయిందా? బహుశా నాలుకకు నరం లేదు అని ఇందుకే అంటారేమో? ఇప్పటికీ టీడీపీ ఎన్డీయేలో ఉంటే ఈ మాట అనేవారు కాదుగా? ఇదేమి రాజకీయమో ఏంటో?



