ఎంకి చావు సుబ్బిశెట్టి చావుకి వచ్చినట్టు ఉంది జీవీఎల్ పరిస్థితి

GVL Narasimha Raoనాలుగు తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వారినే చేర్చుకోవడంతో అధికార పార్టీ మీద వివాదాలు చెలరేగుతున్నాయి. 2018 డిసెంబర్ లో వీళ్లకు వ్యతిరేకంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లెటర్ రాశారు. వారిని అప్పట్లో ఆంధ్ర మాల్యాగా అభివర్ణించారు ఆయన. దీనితో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.

గతంలో తాను తెదేపా రాజ్యసభ సభ్యులను విమర్శించిన మాట నిజమేనన్నారు. దేశాభివృద్ధిని కాంక్షించే భాజపాలో చేరుతున్నట్టు తెదేపా సభ్యులు తెలిపారని చెప్పారు. వారిపై వచ్చిన అభియోగాలపై వాళ్లే సమాధానం చెబుతారని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. తమ పార్టీలో చేరినవాళ్లు మంచివాళ్లని తాను సర్టిఫికేట్‌ ఇవ్వలేదని, భాజపాలో చేరిన తర్వాత తమ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాలన్నారు. అభియోగాలు ఉన్నవారికి తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు.

ADVERTISEMENT

రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేని కారణంగానే కీలక బిల్లులు పాస్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులను చేర్చుకున్నట్టు స్పష్టంచేశారు. అయితే బీజేపీకి సంఖ్యాబలం కోసం, రాజకీయ అవసరాల కోసం ఎటువంటి వారినైనా తీసుకుంటారా అని జీవీఎల్ ను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జీవీఎల్ ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎంకి చావు సుబ్బిశెట్టి చావుకి వచ్చినట్టు ఉంది జీవీఎల్ పరిస్థితి అనడంలో ఎటువంటి అనుమానాలు లేవు.

ADVERTISEMENT
Latest Stories