బీజేపీ ఏపీలో తనకు రహస్యమిత్రులు ఉన్నట్టు ఒప్పుకుందా?

GVL Narasimha Rao BJPఒక వార్తా ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. “మమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు ఘోరంగా దెబ్బ తింటారు. ఒక్క శాతం ఓట్లు తెచ్చుకున్న చోటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం,” అని ఆయన చెప్పుకొచ్చారు.

సహజంగా అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే కనీసం పొత్తులు ఉండాలి లేకపోతే వేరే పార్టీలను తమలో విలీనం చేసుకోవాలి. అయితే ఈ రెండిట్లో ఏది సాధ్యం అవుతుందని ఆయన ఈ మాట అంటున్నారో తెలియాలి. టీడీపీ వారు ఆరోపిస్తున్నట్టు వైకాపా, జనసేనలతో ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా బీజేపీకి?

ADVERTISEMENT

ఆ విషయం ఆయన చెప్పకనే చెప్పారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి గడ్డు కాలం నడుస్తుంది. ఏ పార్టీ కూడా ఆ పార్టీతో ఎన్నికలకు ముందు అవగాహన పెట్టుకునే అవకాశమే లేదు. ఏదైనా పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి వారు కూడా మునిగిపోయే పరిస్థితి మాత్రమే ఉంది. అయితే ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ వస్తే ఇక్కడి పార్టీలు మద్దతు ఇవ్వొచ్చు.

ADVERTISEMENT
Latest Stories