మనం పోయినా పర్లేదు చంద్రబాబు నాశనమైపోవాలి…. బీజేపీ వారి వింత ప్రవర్తన

GVL Narasimha Rao says chandrababu naidu reason for mahakutami lossతెలంగాణ ఎన్నికల సమరంలో ప్రతిపక్ష పార్టీలు కారు జోరుకు కుదేలు అయిపోయాయి. కాంగ్రెస్ 19 సీట్లు, టీడీపీకి రెండు రాగా బీజేపీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. బీజేపీ ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బీజేపీ కోసం ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో 30కి పైగా సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. అంతే గాక గత ఎన్నికలలో గెలిచిన ఐదు సీట్లలో కేవలం ఒకటి మాత్రమే నిలుపుకోగల్గింది.

ADVERTISEMENT

[m9ad]

పార్టీ ప్రెసిడెంటు లక్ష్మణ్, ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా ఈసారి ఓడిపోయారు. అయినా ఆ పార్టీ నేతలకు, ఆ పార్టీ సమర్ధకులకు బాధ లేకపోగా కాంగ్రెస్ ఓటమిని చంద్రబాబు నాయుడు ఓటమి మీద విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహ రావు నిన్న తెలంగాణ బీజేపీకి వచ్చిన ఫలితం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా “చంద్రబాబు నాయుడును ఆంధ్ర సెట్ట్లెర్స్ కూడా నమ్మడం లేదని తెలంగాణ ఫలితాలతో రుజువయ్యింది. టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లో ఓటమికి కౌంట్డౌన్ మొదలయ్యింది. కోతలకు ఓట్లు పడవని, అడ్డగోలు అవినీతికి, అహంకారానికి మూల్యం చెల్లించక తప్పదని ఆంధ్ర సెట్ట్లెర్స్ టీడీపీ కి దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు,” అని ట్విట్టర్ లో వేశారు.

చంద్రబాబు నాయుడుకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు సరే బీజేపీకి ఎటువంటి తీర్పు ఇచ్చారు? పార్టీ చిత్తుగా ఓడిపోయినా ఈ రకంగానే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఎందుకు బలపడుతుంది? 2014 ఎన్నికలలో టీడీపీ తో పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అప్పట్లో ఓటమి నెపాన్ని సైకిల్ పార్టీ మీదకు తోసేసింది. ఇప్పుడు ఎటువంటి పొత్తు లేకుండా వారికి కావాల్సిన వారికి సీట్లు ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడేమి అయినట్టు? గతంలో వెంకయ్య నాయుడు బీజేపీని ఎదగనివ్వలేదు అని ఆయన మీద నిందలు వేశారు.

ఆయన ఇప్పుడు క్రియాశీల రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ సాధించినది ఏంటి? బీజేపీ నుండి గెలిచిన ఒకే ఒక్క నేత రాజాసింగ్ ను కూడా గతంలో పార్టీ నుండి వెళ్ళగొట్టడానికి పార్టీ సీనియర్లు విశ్వప్రయత్నం చేశారు. వారి సహకారం లేకుండానే గెలిచాడు రాజాసింగ్. ఈ క్రమంలో తాము ఎక్కడ ఉన్నాం అన్నది తెలుసుకుంటే ఆ పార్టీకే మంచిది. గత నాలుగున్నర ఏళ్ళలో ఒక ప్రతిపక్షం చెయ్యాల్సిన ఏ పని ఆ పార్టీ చెయ్యలేదు, ఆ పార్టీ అధినాయకత్వం కూడా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తెరాస కొమ్ము కాసింది. అయితే ఇప్పుడు దాని తగిన ప్రతిఫలం చెల్లించుకుంది.

ADVERTISEMENT
Latest Stories