నా వయసు 25 మాత్రమే… అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నా..!

Hansika-Motwani-reveaals her age‘దేశముదురు’తో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ప్రస్తుతం తెలుగులో దూకుడు తగ్గించింది. దీనికి కారణం కూడా లేకపోలేదు అని సవివరంగా చెప్పుకొచ్చింది. తమిళంలో చాలా సినిమాలు చేతిలో ఉండటం వల్లే… తెలుగు పరిశ్రమకు కొంత కాలంగా దూరమయ్యాయని హీరోయిన్ హన్సిక తెలిపింది. ఇప్పడు తాను నటించిన ‘లక్కున్నోడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని… అలాగే జయం రవితో కలసి నటించిన తమిళ సినిమా ‘భోగన్’ కూడా తెలుగులోకి అనువాదం అవుతోందని చెప్పింది.

మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని… ఈ సినిమాలో తానూ చేస్తోన్న పాత్ర ఇంత వరకు చేయలేదని చెప్పింది. మహిళా ప్రాధాన్యత గల పాత్రలను చేయడానికి తనకు ఇంకా చాలా టైమ్ ఉందని, తన వయసు ఇంకా పాతికేళ్లే అని… అందుకే కుర్ర హీరోల పక్కన రొమాంటిక్ పాత్రల్లోనే నటిస్తున్నానని చెప్పింది. ఈ మధ్య కాలంలో తాను బరువు తగ్గిన విషయంపై మాట్లాడుతూ, ఆరు నెలల్లో 13 కిలోల బరువు తగ్గానని తెలిపింది. దీనికోసం ఎలాంటి డైటింగ్ చేయలేదని… తన తల్లి చెప్పిన మెనూని ఫాలో అయ్యానని చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories