ఫ్యాన్స్ అందు ఏపీ బీజేపీ ఫ్యాన్స్ వేరయ్య!

Hari Babu Kambhampatiఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి రెండంకెల ఓట్ షేర్ కూడా లేదు. ఏ పార్టీ అయినా పదవుల పంపకాలలో తాము గెలిచే అవకాశం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ప్రిఫెరెన్స్ ఇవ్వడం సాధారణమే. ఆ లెక్కన లాస్ట్ ప్రిఫెరెన్స్ రాష్ట్రాలలో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఉండటం ఆశ్చర్యకరం కాదు.

ఆ లెక్కన బీజేపీ గానీ బీజేపీ నేతృత్యంలోని కేంద్ర ప్రభుత్వానికి గానీ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ప్రిఫెరెన్స్. అయితే అప్పుడప్పుడు కొన్ని పదవులు ఇస్తే దానికి ఆనందించాల్సింది పోయి సొంత పార్టీ కార్యకర్తలే పేర్లు పెట్టడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే… మాజీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుని మిజోరం గవర్నర్ గా నియమించారు.

ADVERTISEMENT

అయితే ఆయన వెంకయ్య నాయుడు మనిషి అని.. పార్టీకి నష్టమని ఆ పార్టీ సమర్ధకులు ట్విట్టర్ లో వీరంగం సృష్టిస్తున్నారు. పైగా హరిబాబుకు బెస్ట్ విషెస్ చెబుతూ వెంకయ్య నాయుడు ట్వీట్ చెయ్యడంతో మరింత చెలరేగిపోతున్నారు. వెంకయ్య గానీ హరిబాబు గానీ పార్టీని 70వ దశకం నుండీ పార్టీలో ఉన్నారు.

వారిని చంద్రబాబు మనుషులు అని ముద్ర వేస్తూ ఎప్పుడు నిందలు వేస్తూనే ఉంటారు. అయితే పార్టీ అధినాయకత్వం వారి సేవలను గుర్తిస్తుంది అంటే వారు ఎవరి మనుషులు అనేది అర్ధం అవుతుంది కదా? ఈ నియామకం వల్ల నిజంగా ఏదైనా లాభం రావడమంటూ జరిగితే అది కూడా రానిచ్చేలా లేరు ఈ సో కాల్డ్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories