హరిబాబుకు గౌరవంగానే వీడుకోలు పలుకుతున్న బీజేపీ

Kambhampati Haribabu responds on AP railway zoneఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కంభంపాటి హరిబాబును జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.

సోమువీర్రాజు, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి ఈ నాలుగు పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ఆకుల సత్యనారాయణ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. కాపు వర్గానికి చెందిన నాయకుడే ఉంటే మేలని బీజేపీ నాయకత్వం అభిప్రాయం.

ADVERTISEMENT

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాల ఆధారంగానే అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా నియమించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల తరువాత జరిగే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో హరిబాబుకు చోటు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories