ప్రగతి నివేదన సభకు హరీష్ రావును దూరం పెట్టారా?

harish rao away from Pragathi Nivedhana Sabha కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు మంత్రి హరీష్ రావును దూరం పెట్టారా? అంటే అవును అనే అంటున్నాయి తెరాసలోని ఆయన వర్గాలు. మంత్రి కేటీఆర్ అన్నిటా తానై సభ ఏర్పాట్లలో బిజిగా ఉండగా, సీనియర్ మంత్రి హరీష్ రావు ఇవేమి అంటీముట్టనట్టు తన నియోజకవర్గంలోను,పక్క నియోజకవర్గంలోను పర్యటిస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

ముందస్తు ఎన్నికలకు సన్నాహంగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం చేసి దానిని కేటీఆర్ ఖాతాలో వేయ్యాలని పథకం. దానికోసమే వ్యూహాత్మకంగా హరీష్ రావును పక్కన పెట్టారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అన్ని ఉప ఎన్నికలలో హరీష్ రావుకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తర్వాత తగ్గింది, ఇప్పుడు సభ ఏర్పాట్ల కమిటీలో కూడా హరీష్ రావుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.

ముందస్తు ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధిస్తే, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో ఏర్పాటు కాబోయే తరువాతి ప్రభుత్వం కీలక భూమిక పోషించాలని ఆయన వ్యూహం.

ADVERTISEMENT
Latest Stories