
తెలంగాణ రాజకీయాలలో తమకు తిరుగేలేదని అహంతో విర్రవీగిన బిఆర్ఎస్ పార్టీ నేటికీ తమ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవడానికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పేరు వాడుకోకతప్పడం లేదు. ఆయనను బూచిగా చూపిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నారని, నీళ్ళు దోచుకుపోతున్నారని హరీష్ రావు విమర్శిస్తూనే ఉంటారు.
అయితే చంద్రబాబు నాయుడుని గద్దె దించడానికి జగన్‌తో చేతులు కలిపి ఏపీ రాజకీయాలలో వేలుపెట్టిన విషయం వారికి గుర్తు ఉండదు. తద్వారా అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయించిన సంగతి బిఆర్ఎస్ నేతలకు గుర్తు ఉండదు.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
ఏపీకి రాజధాని లేకపోవడం, జగన్ అరాచకపాలనని అనుకూలంగా మలుచుకొని పరిశ్రమలు సాధించుకోవడం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు గుర్తు ఉండదు.
కానీ తెలంగాణ రాజకీయాలకు దూరంగా సిఎం చంద్రబాబు నాయుడు ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా వారికి తప్పుగానే కనిపిస్తుంది. సెంటిమెంట్ రాజకీయాలు చేసుకోవడానికి మంచి అవకాశంగానే భావిస్తుంటారు.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
నిన్న సిఎం చంద్రబాబు నాయుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తాను అడ్డుపడలేదని, తెలంగాణకు దాంతో సహా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు అవసరమని, ఏపీ వాటాగా రావలసిన నీటిని దిగువకు విడిచిపెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు.
వెంటనే హరీష్ రావు కొన్ని కాగితాలు పట్టుకొని వచ్చి ప్రెస్‌మీట్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెపుతున్నారంటూ గట్టిగా వాదించారు.
Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో కొన్నివేల ఫైల్స్, లేఖలపై సంతకాలు చేసి ఉంటారు. వాటిలో ప్రతీది గుర్తుంచుకోవడం సాధ్యం కాదు కదా?
నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏవిదంగా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీతో పంచాయితీలు పెట్టేవారో అందరూ చూశారు. అదేవిదంగా సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఏపీకి నష్టం జరగకూడదని కోరుకుంటే తప్పేలా అవుతుంది.
ఒకవేళ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దన్నా, ఇప్పుడు అభ్యంతరం లేదని, కొత్తవి కట్టుకోమని చెపుతున్నారు కదా?
అయినా ఇంకా ఎంతకాలం ఏపీని, చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటారో తెలీదు కానీ కాంగ్రెస్, బీజేపిలను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు పేరు వాడుకుంటున్నందుకు వారే సిగ్గుపడాలి.