టీడీపీ కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడే నైతికత తెరాసకు ఉందా?

Harish Rao Anti Chandrababu Naidu Commentsతెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారమంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూనే తిరుగుతుంది. ఒకప్పుడు తెలుగు దేశం గురించి మాట్లాడటానికి ఏముంది అదో 0.25% పార్టీ అని ఊదరగొట్టిన తెరాస వారు ఇప్పుడు చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు ఏపీ ఎన్నికలపై జోస్యం చెప్పారు.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు మోసాల్ని ఏపీ ప్రజలు ఇక ఎంతమాత్రం భరించరని అంటున్నారు హరీష్. రైతు ఋణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అంటూ ప్రజలని చంద్రబాబు మోసం చేసారని హరీష్ ఆరోపించారు. ఇదంతా బానే ఉంది అసలు ఇప్పుడు జరుగుతున్నవి తెలంగాణ ఎన్నికలా ఆంధ్ర ఎన్నికలా?

“సిగ్గులేని చంద్రబాబు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు. సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు. అప్పుడు ఇటలీ దెయ్యమైన సోనియా, ఇప్పుడు దేవత ఎలా అయిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి,” హరీష్ రావు టీడీపీ కాంగ్రెస్ పొత్తును విమర్శించారు. అయితే గతంలో కేసీఆర్ కూడా సోనియాను ఇంతకంటే ఎక్కువే అన్నారు. హరీష్ రావుతో పాటు కేసీఆర్ కుటుంబంలోని పిల్లా పీచుతో సహా ఢిల్లీ వెళ్ళి సోనియాతో ఫోటోలు తీయించుకున్నారు అది కూడా తప్పేనా? ఆ తరువాత శాసనసభలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ప్రకటించలేదా? అప్పుడు దేవతైన సోనియా ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యింది? రాజకీయ అవసరాలను బట్టి తెరాసకు మిత్రులు శత్రువులు మారొచ్చు…. టీడీపీ కి మాత్రం ఆ సౌలభ్యం ఉండదా? టీడీపీ కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడే నైతికత తెరాసకు ఉందా?

ADVERTISEMENT
Latest Stories