పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని అరెస్టు చేసారు అధికారులు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యే ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు అంటూ కౌశిక్ కు మద్దతుగా ఆయన ఇంటికి వచ్చిన బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ని సైతం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
దీనితో పాడి కౌశిక్ నివాస ప్రాంగణమంతా బిఆర్ఎస్ శ్రేణుల నిరసనతో మారుమోగింది. అయితే ఎక్కడిక్కడ పోలీసులు నిరసన కారులను అదుపులోకి తీసుకుని కౌశిక్ రెడ్డి తో పాటుగా హరీష్ రావు ను పలువురు బిఆర్ఎస్ నేతలను పీఎస్ కు తరలించారు. హరీష్ ను తరలించిన గచ్చిబౌలి పీఎస్ ముందట బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
పార్టీ కార్యకర్తలకు తోడుగా ఎమ్మెల్సీ కవిత కూడా గచ్చిబౌలి పీఎస్ ముందు హరీష్ రావు ను వెంటనే విడుదల చెయ్యాలి అంటూ ఆందోళలనకు కూర్చున్నారు. పనిలోపనిగా ఇది ప్రజా పాలనా.? లేక ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనా.? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విమర్శలతో విరుచుకుపడ్డారు.
ప్రశ్నిస్తే కేసులు, పార్టీ హామీల అమలును నిలదీస్తే అరెస్టులా అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ పార్టీ నేతల అక్రమ అరెస్టు ను ఖండిస్తున్నా, ఇది ముమ్మాటికీ అప్రజాస్వామ్యం, దీని మూల్యం చెల్లించే రోజులు తిరిగి వస్తాయి అంటూ రేవంత్ సర్కార్ కు హెచ్చరికలు పంపారు కేటీఆర్.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో తన ఎన్నికల ప్రచారంలో మొదలుపెట్టిన ఈ రచ్చ ఇప్పటికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా కొనసాగిస్తూనే ఉన్నారు. నిత్యం ఏదోఒక వివాదంలో దూరడం, లేదా ఒక వివాదాన్ని సృష్టించడం, నలుగురు కార్యకర్తలను ముందేసుకోవడం, మరో నలుగురు బిఆర్ఎస్ నాయకులను వెనకేసుకోవడం హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది.
ఆయనను అదుపులోకి తీసుకోవడానికి అధికారులు ఇంటికి వెళ్లడం, అక్కడ పార్టీ శ్రేణులు ఉద్రిక్త వాతావరణం సృష్టించడం, దీనితో బిఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయ దిన చర్యలో భాగమయ్యింది. అయితే ఈసారి ఈ హైడ్రామాలో హరీష్ రావు కూడా పీఎస్ లో ఉండడం బిఆర్ఎస్ శ్రేణులు ఆవేశం మరింత ఎక్కువయ్యింది.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…