t-harish-rao

జగన్‌ ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో క్రీస్టియన్, మైనార్టీ వర్గాల ఓటు బ్యాంక్ కారణంగా బీజేపితో ఎన్నటికీ చేతులు కలపలేరు. మరోపక్క కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపి మూడు పార్టీల మద్య మంచి సఖ్యత ఉంది.

చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్‌. ఆయన పట్ల నారా లోకేష్‌ చూపుతున్న గౌరవ మర్యాదలు, అలాగే మూడు పార్టీల మద్య పదవులు పంపకాలను చూస్తే వాటి మద్య బంధం నానాటికీ బలపడుతోందని స్పష్టమవుతోంది.

Also Read – జైల్లో సౌకర్యాలు లేవు… ఇలా అయితే ఎలా?

కనుక జగన్‌ ఎప్పటికీ ‘ఒంటరి సింహం’లా మిగిలిపోక తప్పదు. ఈ రెండు ప్రభుత్వ విధానాలు, పనితీరులో కూడా చాలా తేడా ఉంది. కనుక ఆంధ్రాలో రాజకీయాలు, పార్టీల సమీకరణాలు, విధానాలు అన్నీ ఫిక్స్ అయిపోయినట్లే భావించవచ్చు.

కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగినా దాని పరిస్థితి అంత గొప్పగా లేదు. ఆర్ధిక సమస్యలు, కాంగ్రెస్‌ అధిష్టానం, మోడీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు కాళ్ళు కట్టేసి అడుగు ముందుకు వేయకుండా నిలువరిస్తున్నాయి.

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?

తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి ఈవిదంగా ఉంటే, దానిపై నిత్యం కత్తులు దూస్తున్న బిఆర్ఎస్ పార్టీ పుంజుకొని రెండో స్థానంలోకి వచ్చినట్లు కనబడుతోంది. కానీ తెలంగాణలో బీజేపి మళ్ళీ సైలంట్ అయినందునే బిఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో రాగలిగింది తప్ప ఆ పార్టీ బలపడలేదు. పుంజుకోలేదు.

కేసీఆర్‌ అడపాదడపా బయటకు వచ్చి కాంగ్రెస్‌, బీజేపిలని తిట్టిపోసి మళ్ళీ ఫామ్‌హౌస్‌లో పడుకుంటుంటే, బిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్‌, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ముగ్గురి మద్య రాజకీయ ఆధిపత్యపోరు కొనసాగుతోంది.

Also Read – వైఎస్ స్పూర్తి.. వద్దు పైనున్న ఆయన బాధపడతారు!

బిఆర్ఎస్ పార్టీలో ఎప్పటికైనా కేసీఆర్‌, కేటీఆర్‌, కవితకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది తప్ప హరీష్ రావుకు ఉండదనే విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది.

కానీ హరీష్ రావుకు వేరే ప్రత్యామ్నాయం లేకనే బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ ఏపీలో టీడీపీ, బీజేపి, జనసేనలు కూటమి ప్రయోగం విజయవంతం అయ్యింది. వాటి ప్రభుత్వం కూడా అద్భుతంగా సాగుతోంది. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి తెలంగాణలో పోటీ చేయడం దాదాపు ఖాయమే అని భావించవచ్చు.

తెలంగాణలో నేటికీ టీడీపీ ఉన్నప్పటికీ ఆ పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. చంద్రబాబు నాయుడు దానిని హరీష్ రావు కోసమే రిజర్వ్ చేసి ఉంచారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి!

వచ్చే ఎన్నికలలో కూటమి పోటీకి దిగితే, హరీష్ రావు టీడీపీలో చేరి పార్టీ పగ్గాలు చేపట్టి, ఎన్నికలలో కూటమిని గెలిపించుకుంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది.

అదే జరిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలకు ఎదురీత తప్పదు. కనుక వచ్చే ఎన్నికలలో హరీష్ రావు ‘గేమ్ చేంజర్‌’గా నిలిచే అవకాశం ఉంది.