చుక్కలు చూపిస్తోన్న సోషల్ మీడియా?

Unscientific: Harish Shankar on Negative Reviews Dishti & 2/5 Ratingsసినీ సెలబ్రిటీలపై గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. సినిమాలు పుట్టిన నాటి నుండి నేటి వరకు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికీ ఆగే పరిస్థితి కూడా లేదు. సెలబ్రిటీలపై సామాన్య ప్రేక్షకులలో ఉండే మక్కువ, క్రేజ్ వలన, ఎక్కడ లేని పుకార్లు ఈ ఇండస్ట్రీలోనే పుట్టుకొస్తాయి. అయితే పెరిగిన సోషల్ మీడియా ప్రభావంతో… చిలవలు, పలువలుగా పుట్టుకొస్తున్న పుకార్లు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒకప్పుడు సైలెంట్ గా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం పెదవి విప్పక తప్పడం లేదు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని అర్ధమవుతోంది. తొలుత ‘కింగ్’ నాగార్జునతో ప్రారంభమైన ఈ సీరియస్ నెస్, క్రమంగా ఒక్కొక్కరిని పాకుతోందన్న సంకేతాలు కనపడుతున్నాయి. పుకార్లను ఖండిస్తూ నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న వైనం తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలైన ‘దువ్వాడ జగన్నాధమ్’ విషయంలో అయితే హీరో బన్నీ, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు ఏకతాటిపైకి వచ్చి సోషల్ మీడియా మీద పడ్డారు.

ADVERTISEMENT

అలాగే తన అభిమానిని నాచురల్ స్టార్ నాని అవమానించాడని జరిగిన రచ్చ తెలియనిది కాదు. తాజాగా హీరో రవితేజ కూడా సోషల్ మీడియాపై గళం విప్పారు. తన సోదరుడు భరత్ మృతి సందర్భంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కాస్త అసహనం వ్యక్తం చేసిన రవితేజ, అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకుని రాయడం కనీస బాధ్యతగా గుర్తు చేసారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే మున్ముందు తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని భావించి, ముందుగానే ఈ సెలబ్రిటీలందరూ రియాక్ట్ అవుతున్నారా? అయితే రియాక్షన్ వీళ్ళతోనే ఆగిపోతుందా? లేక ఇదే బాటలో మరికొందరు సెలబ్రిటీలు నడిచే అవకాశం కనపడుతోందా? ఒక్కటైతే స్పష్టంగా అర్ధమవుతోంది… ఒకప్పుడు గాసిప్స్ ని విని ఆహ్లాదకరంగా నవ్వుకునే సెలబ్రిటీలు, ఇప్పుడు అవే పుకార్లను ఖండిస్తూ… ఎదురు దాడి చేయబోతున్నట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories