ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ అవసరం లేదని కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. ముఖ్యంగా మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీయడంతో… ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చలో ఫోన్ లో పాల్గొన్న ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా – ఏపీ హక్కు అంటూ పోరాడుతున్న శివాజీ గతంలో చాలా సందర్భాలలో తన ఆవేదనను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి స్పందనతో మరోసారి మీడియా వేదికగా బిజెపి తీరును తూర్పారబట్టారు.
“ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కేంద్రం అమ్మ పెట్టానివ్వదు, అడుక్కుతినానివ్వదు అన్న మాదిరి తయారయ్యిందని, సాక్షాత్తూ అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష అందరికీ తెలిసి వచ్చిందని, ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉందని… చూడాల్సింది… చేయాల్సింది కూడా బాబు గారేనని” అన్నారు.
ఇక, కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరిని ఉద్దేశిస్తూ… ఎవడో సన్నాసి మంత్రి ఒకడు చెప్పాడని చెప్పి ఆ వెధవకు తెలియదేమో… 14వ ఆర్ధిక సంఘం… బిజెపి సన్నాసుల్లారా ఒకసారి వినండి… 14వ ఆర్ధిక సంఘం బీహార్ కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమని చెప్పిందా..? సన్నాసి వెధవల్లారా… మీరు మనుషులేనా..? అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భం గా వెంకయ్య నాయుడు ఎపి స్పెషల్ స్టేటస్ కోసం ఆడిన నాటకం ఎవరు మర్చిపోలేరన్నారు. చంద్రబాబు పైనే ప్రజలు నమ్మకం పెట్టుకుని ఉన్నారని, ఇక పైన కూడా ఆయన్నే నమ్ముతారంటూ, జగన్ జంప్ చేస్తున్న తన పార్టీ నాయకుల గోల పక్కన పట్టి ప్రజలకి ఉపయోగపడే పనులు ఎం చేసారో చెప్తే బాగుంటుందన్నారు.



