నిన్నటిదాకా తెలుగు వెర్సెస్ తెలంగాణ.. ఇప్పుడు తెలుగు వెర్సెస్ తమిళం

NTR Trivikram poster

నిన్నటిదాకా “ఇడుపు కాయితం” టైటిల్ విషయంలో తెలుగు యువత రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న విధానం చూశాం. ఎవడో ఒక వెధవ “తెలుగులో డబ్బింగ్ చేస్తారా?” అని పెట్టిన ట్వీట్ ఏకంగా టీవీ డిబేట్స్ & పొలిటికల్ ప్రెస్ మీట్స్ కి ఇంధనంలా మారి లేనిపోని విద్వేషాలను రెచ్చగొట్టింది. తెలంగాణలోని పొలిటికల్ ఎనలిస్టులు, కొత్తగా పార్టీలు పెట్టుకున్న నేతలు ఈ అంశం నుండి బాగా మైలేజ్ పొందారు. ఇది ఇంకెన్నాళ్లు నడుస్తుందిరా బాబు అనుకుంటున్న తరుణంలో.. ఇప్పుడు తెలుగు వెర్సెస్ తమిళం గోల మొదలైంది.

విషయం ఏంటంటే.. నిన్న విడుదలైన ఎన్టీఆర్-త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ పోస్టర్ టైంలో “బోర్న్ ఇన్ నార్త్” అని ట్వీట్ చేశాడు నాగవంశీ. దాంతో తమిళందరూ ఒక్కసారిగా గళం పెంచారు. “నువ్వు సినిమా తీసేది మా తమిళ దేవుడు మురుగన్ మీద, ఆయన్ని నార్త్ లో పుట్టాడు అని ఎలా అంటావ్?” అంటూ ప్రశ్నించడం మొదలెట్టారు.

ADVERTISEMENT

మొదట్లో ఏదో చిన్న మేటర్ అనుకుంటే.. రాత్రికి రాత్రి సోషల్ మీడియా మొత్తం ఈ డిస్కషన్ తోనే నిండిపోయింది. అసలు దేవుడికి భాష, ప్రాంతం, రాష్ట్రం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తుండగా.. తమిళోళ్లు మాత్రం ఏదేమైనా మురుగన్ మావాడే అని వాదిస్తున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు తెలుగోడా, తమిళోడా అనేదానికంటే.. నాగవంశీ వేసిన “బోర్న్ ఇన్ నార్త్” అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.

ఈ విషయాన్ని కాస్త పరిశీలిస్తే.. మనం మనుషులుగా ఎంత దీన స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. అసలు భూమ్మీద పుట్టని దేవుడికి భాషను, ప్రాంతాన్ని రుద్ది మావాడు అంటే మావాడు అంటూ కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన రేపు కృష్ణుడు, రాముడు మావోడు అతడిపై సినిమాలు తీయడానికి మీరెవరు అంటూ ఉత్తరప్రదేశ్ వాళ్ళు అల్లర్లు చేయాలా? ఈ విద్వేషాలను బుర్రలో ఇరికించేసుకుని బ్రతకాల్సిన అవసరం ఉందా?

ఇకపోతే.. ఈ దెబ్బతో ఇడుపు కాయితం టైటిల్ విషయంలో జరుగుతున్న గోలకి తెర పడినట్లే. ఎందుకంటే.. ట్విట్టర్ యువత, టీవీ డిబెట్లు ఇకపై “గాడ్ ఆఫ్ వార్” విషయం వైపు మళ్లుతాయి కాబట్టి.

ADVERTISEMENT
Latest Stories