హైకోర్టు వద్దంటే మానేస్తామా.. శాఖలకి వద్దంటే మంత్రులకు సలహాదారులు

High_Court_of_Andhra_Pradesh_Jaganవైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నా, ప్రత్యేకంగా ‘ప్రభుత్వ సలహాదారు’ ఉద్యోగాలను సృష్టించి మరీ పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు, అస్మదీయులకు లక్షల రూపాయల జీతభత్యాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేస్తుండటంతో ప్రభుత్వం సలహాదారులను తొలగిస్తుందని భావిస్తే, ఆ అనధికార ఉద్యోగాలకు చట్టబద్దత కల్పించి శాశ్వితంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ADVERTISEMENT

రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (పోలిటికల్) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎఫిడవిట్ ద్వారా హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ శాఖలకు సలహాదారుల నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నందున త్వరలోనే ఈ నియామకాల కోసం ఓ నిర్ధిష్టమైన విధానం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. దానికి సంబందించి మార్గదర్శకాలను కూడా ఆయన హైకోర్టుకు అందజేశారు. దానిలో వారి పదవీకాలం జీతభత్యాలు, విధులు, అధికారాలు తదితర అంశాలను పేర్కొన్నారు.

ప్రభుత్వ శాఖలకు సలహాదారులుగా నియమితులైన వారందరినీ ఇకపై ఆయా శాఖల మంత్రులకు సలహాదారులుగా మార్చుతూ ప్రభుత్వం త్వరలోనే జీవో విడుదల చేస్తుందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం చేసి జీవో విడుదల చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వ నిర్వహణ కోసమే అనేకమంది ఐఏఎస్ అధికారులున్నారు. ఇంకా వేలాది మంది ఉన్నతాధికారులు, లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రానికి సంబందించిన అన్ని అంశాలపై వారందరికీ చక్కటి అవగాహన, ప్రభుత్వ నిర్వహణలో అపారమైన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వారి ద్వారానే ప్రభుత్వ నిర్వహణ జరుగుతోంది.

కానీ అస్మదీయులకు ఉపాధి కల్పించేందుకే వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా సలహాదారులను నియమించుకొంటోందని హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సలహాదారుల చట్టబద్దత సంగతి తేల్చేస్తామని హెచ్చరించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ తొలగిస్తే హైకోర్టు మాటకి గౌరవం ఇచ్చిన్నట్లు ఉండేది.

కానీ హైకోర్టు హెచ్చరికలో ‘సలహాదారులకు చట్టబద్దత లేదనే’ విషయాన్ని గుర్తించి, ప్రభుత్వం అందుకు సిద్దం అవుతుండటం విస్మయం కలిగిస్తుంది.

రాష్ట్ర ఆర్ధికస్థితిని దారుణంగా దెబ్బ తీస్తున్న అప్పులు, వడ్డీలు ఓవైపు, మరోవైపు వైసీపీ కోసం లక్షలాదిమందితో ప్రత్యేకంగా సృష్టించుకొన్న సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు గుదిబండల్లా ఉంటే, ఇవన్నీ సరిపోవన్నట్లు అవసరం లేకపోయినా డజన్ల కొద్దీ సలహాదారులను నియమించుకొంటూ ఆర్ధికభారం పెంచుకొంటోంది.

అయితే ఈ భారాన్ని సామాన్య ప్రజలే మోయాల్సి ఉంటుంది తప్ప వైసీపీ లేదా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మోయరు కనుక హైకోర్టు అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ముందుకే సాగుతోంది. ప్రభుత్వ విధానాలలో లోపం ఉందని తెలిసి ఉన్నప్పటికీ వాటిని సవరించేందుకు యంత్రాంగం, న్యాయవ్యవస్థలకు అధికారాలు లేకపోవడం వలననే ఇలా సాగిపోతోంది.

ADVERTISEMENT
Latest Stories