ప్రభాస్ గెస్ట్ హౌస్ పై హై కోర్టులో కీలక పరిణామం

High Court  responds on Prabhas Guest House రాయదుర్గంలో తన గెస్ట్ హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేయడంపై హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ మళ్ళీ విచారణకు వచ్చింది. రెగ్యులరైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలనలో ఎందుకు వెనక్కి పంపారని రెవెన్యూ అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. అదే విధంగా రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు.

[m9ad]

ADVERTISEMENT

రేపు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. ఈక్రమంలో కేసును ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. అయితే రెగ్యులరైజేషన్ తిరస్కరించడం ఏమీ జరగలేదని, అటువంటి ఉత్తరువులు ఏమీ రాలేదని కాబట్టి ఈ కేసు తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభాస్ తరపు లాయర్లు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రెగ్యులరైజేషన్ పిటిషన్ ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగు ఉందని వారు చెబుతున్నారు. అదే గనుక నిజమైతే రేపు కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు.

ఇంతకు ముందు ప్రభాస్ తన పిటిషన్ .లో ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవిరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి చట్టబద్ధంగా తాము కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని తెలియజేశారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకోసం రూ. 1.05 కోట్ల ఫీజును కూడా చెల్లించామని ఆయన వివరించారు.

ADVERTISEMENT
Latest Stories