ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సహా 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీఐఎస్ఎఫ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది.
[m9ad]
విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు ఈ రోజు కోర్టుకు విశాఖ ఎయిర్‌పోర్టు సీసీటీవీ కోర్ టీమ్ హాజరైంది. అయితే… మూడు నెలలుగా సీసీటీవీ ఫుటేజీ లేదని కోర్ టీమ్ హైకోర్టుకు తెలపడం సంచలనం.
సీసీ టీవీ ఫుటేజ్ లేదని చెప్పడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీ టీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందో అధికారులు చెప్పలేకపోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విశాఖ ఎయిర్ పోర్టు నేవీ అధీనంలో ఉంది, అదే సమయంలో ఎయిర్ పోర్టు భద్రత అంతా సీఐఎస్ఎఫ్ అధికారుల అధీనంలో ఉంటుంది. వీటి మధ్య సీసీ టీవీ ఫుటేజ్ ఎవరి అధీనంలో ఉందా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు దాదాపుగా మూడు వరాల విశ్రాంతి అనంతరం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టారు. తొలిరోజు ఆయన 6.8 కిలోమీటర్ల మేర నడిచారు. దీనితో ఇప్పటివరకు ఆయన 295 రోజులలో 3218.3 కిలోమీటర్ల పాటు నడిచారని సాక్షి చెబుతుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా లో జరుగుతున్న పాదయాత్ర శ్రీకాకుళంతో ముగుస్తుంది.



