4 పార్టీలు..2 బంధాలు..8 మంది నేతలు..

How AP and Telangana Politics Mirror Each Other

రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ ఏపీలో బాబు కి పవన్ – అక్కడ తెలంగాణలో కేసీఆర్ కి జగన్ తోడుగా ఉంటున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ కి లోకేష్ – అక్కడ బిఆర్ఎస్ కి కేటీఆర్ భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్నారు.

ఇక జగన్ కు సజ్జల, అవినాష్ మాదిరి కేసీఆర్ కు హరీష్, సంతోష్ లు వెన్నుదండుగా ఉంటున్నారు. అలాగే ఇటు వైసీపీ కి షర్మిల గండం అటు బిఆర్ఎస్ కు కవిత పోరు వెంటాడుతున్నాయి. ఇక టీడీపీ కి – జనసేన, బిఆర్ఎస్ కు వైసీపీ మద్దతుగా నిలుస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే టీడీపీ – జనసేన బంధం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కాగా తెలుగు రాష్ట్రాలలో టీడీపీ వినాశనమే బిఆర్ఎస్ – వైసీపీ ల అనుబంధానికి పునాదిగా మారింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ నాలుగు పార్టీల మధ్య ఏర్పాటైన రెండు బంధాలు ఎనిమిది మంది రాజకీయ నాయకుల భవిష్యత్ రాజకీయాన్ని నిర్దేశిస్తున్నాయి.

ప్రత్యేక తెలంగాణ నినాదం తో ముందుకెళ్లిన బిఆర్ఎస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్లోగన్ తో రాజకీయం నడిపిన వైసీపీ మధ్య రాజకీయ మిత్రుత్వం ఏర్పడడమే ఇక్కడ రాజకీయం. సిద్ధాంతపరంగా ఈ రెండు పార్టీల మధ్య ఇంత వైరుధ్యం, వైవిధ్యం ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల కలయిక వెనుక ఉన్న ప్రధమ కారణం టీడీపీ పతనం, బాబు ఓటమే.

అలాగే ఏపీ పురోగతే జనసేన ఆలోచన అంటూ పవన్, విభజిత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే టీడీపీ ధ్యేయం అంటూ బాబు ఒక్కటయ్యాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య, ఇద్దరి నేతల మధ్య ఏర్పడిన, స్నేహం ఒక రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తుంటే,

అక్కడ ఆ రెండు పార్టీల మధ్య, ఇద్దరి నాయకుల మధ్య ఏర్పడిన అనుబంధం ఒక పార్టీ వినాశనాన్ని , ఒక నాయకుడి పతనాన్ని కోరుకుంటుంది. అలాగే పవన్ ను బాబు దత్తపుత్రుడిగా వైసీపీ చిత్రీకరిస్తుంటే, బిఆర్ఎస్ తెరచాటు స్నేహితుడిగా జగన్ ను టీడీపీ ఆవిష్కరిస్తుంది.

టీడీపీ పతనమే మా పంతం అంటూ ముందుకెళుతున్న జగన్, కేసీఆర్ లకు వైసీపీ వినాశనమే తన లక్ష్యం అంటూ చెల్లి షర్మిల బాణాలు సంధిస్తుంటే, బిఆర్ఎస్ ఉనికే గల్లంతు అంటూ కవిత కథం తొక్కుతున్నారు. ఇక బాబు తరువాత టీడీపీ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకోవడానికి నారా లోకేష్ సంసిద్దమవుతుంటే కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు.

ఇలా ఈ నాలుగు పార్టీలు, వాటి మధ్య చిగురించిన రెండు బంధాలు, ఆ ఎనిమిదిమంది నేతలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఎల్లప్పుడ్డు సంసిద్ధంగా ఉంటారు.

ADVERTISEMENT
Latest Stories