మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేతా పేతురాజ్ ఎందుకో మెయిన్ హీరోయిన్ స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే.. “చిత్రలహరి, అల వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా” వంటి సినిమాల్లో ఆమె పోషించిన పాత్రకి, ఆమె నటనకి మంచి అభిమానులున్నారు. విశ్వక్ సేన్ తో “పాగల్, దాస్ కి దంకి” లాంటి సినిమాలు చేశాక సడన్ గా సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది నివేతా పేతురాజ్.
తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ రజిత్ ఇబ్రాన్ ను పెళ్లాడడం కోసం సినిమాలు యాక్సెప్ట్ చేయడం ఆపేసింది, దుబాయ్ లో సెటిల్ అవ్వడం కోసం ఇక్కడ ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి పెట్టేసింది. 2025లో జరగాల్సిన పెళ్లి కారణాంతరాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. దాంతో నివేతా కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయింది.
అయితే.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతోంది నివేతా. ఆల్రెడీ త్రివిక్రమ్ హెల్ప్ తో “ఆదర్శ కుటుంబం” సినిమాలో మంచి ఆఫర్ కొట్టేసిన నివేతా.. ఇప్పుడు చిరంజీవి-బాబీ సినిమాలోనూ ఓ కీలకపాత్ర పోషించే ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. ఇవి మాత్రమే కాకుండా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “సింగ్ గీతం”లోనూ నివేతా కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. నివేతా మళ్లీ ఫుల్ ఫామ్ కి వచ్చినట్లే. ఇక తమిళంలో ఆఫర్లు దక్కించుకోవడంపై శ్రద్ధ పెట్టి.. ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్ గా సెటిల్ అయిపోతుందేమో చూడాలి.




