హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్లు… మరి ఏపీలో?

Hyderabad Real Estateహైదరాబాద్‌ శివార్లలోని కోకాపేట నియో పోలీస్ ఫేజ్-2లో గల భూములను హెచ్ఎండీఏ వేలంవేయగా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీలు పడి మరీ ఎకరానికి రూ.67.25 నుంచి రూ.100. 75 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాయి. ఎందుకంటే హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటమే కారణం.

హెచ్ఎండీఏ సంస్థ నిన్న మొత్తం 45.33 ఎకరాలు ఆన్‌లైన్‌లో వేలంపాట వేస్తే మొత్తం రూ.3,319.60 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే సగటున ఎకరం రూ.73.23 కోట్లు పలికిందన్న మాట!

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు అమరావతిని, రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాలను, పట్టణాలను కూడా ఇదేవిదంగా అభివృద్ధి చేద్దామని కలలు కన్నారు. వేలకోట్లు ఖర్చు చేసి అమరావతిని కొంతవరకు అభివృద్ధి చేశారు. అలాగే భోగాపురంలో అంతర్జాతీయ విమాశ్రయం ఏర్పాటుచేస్తే ఉత్తరాంద్రలోని మూడు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని దాని కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తిచేశారు.

అటు రాయలసీమని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు శ్రీసిటీ వంటి పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి ఐకియా, హీరో మోటార్స్ వంటి అనేక సంస్థలను తీసుకువచ్చారు. అంటే జగన్ ప్రభుత్వం చెప్పుకొంటున్నట్లు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చంద్రబాబు నాయుడు ఆనాడే అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేశారని అర్దమవుతోంది.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఆ అభివృద్ధిపనులను యధాతధంగా కొనసాగించి ఉండి ఉంటే ఈపాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణకు అందనంత ఎత్తులో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత కక్ష, ద్వేషంతో లక్షల కోట్లు విలువగల అమరావతిని నిర్ధాక్షిణ్యంగా పాడుపెట్టేశారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్‌తో రివర్స్ పాలన సాగిస్తుండటం వలన ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో వెనుకబడిపోయి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితులలోకి జారుకొంది.

ఇదివరకు కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఒక ఎకరం అమ్ముకొంటే ఆంద్రాలో మూడెకరాలు కొనుక్కోవచ్చని అన్నప్పుడు వైసీపీ మంత్రులకు చాలా రోషం వచ్చేసింది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఎకరం దాదాపు రూ.101 కోట్లుకి అమ్ముడైతే, దాంతో ఏపీలో ఎన్ని ఎకరాలు కొనుగోలు చేయవచ్చో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనే వైసీపీ నేతలకు బాగానే తెలిసి ఉంటుంది.

సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలలో చాలామందికి హైదరాబాద్‌లోనే అనేక భూములు, ఇళ్ళు ఉన్నాయి. కనుక తెలంగాణ, హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందుతున్నకొద్దీ వారు కూడా లాభపడుతూనే ఉంటారు. అది చూసైనా ఏపీని కూడా ఆవిదంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన మాత్రం వారికి కలగకపోవడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమే కదా?

ADVERTISEMENT
Latest Stories