బినామీ పేర్లతో తాను భూములు కొనుగోలు చేశానని ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని, చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, ఒకవేళ ఉన్నట్టు నిరూపిస్తే అసెంబ్లీ ఎదుట ఉరి వేసుకుంటానని గతంలోనే ప్రకటించానని, వివాదాలు ఉన్న భూములను తానెప్పుడూ కొనలేదని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.
నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి భూదందా ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళీమోహన్, విజయవాడలో ఏడు ఎకరాలు మాత్రమే తాను కొనుగోలు చేశానని స్పష్టం చేసారు. వైఎస్సార్, పీజేఆర్ లు కూడా తనపై నాడు ఆరోపణలు చేసారు కానీ, నిరూపించలేకపోయారని, 1993 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని, ఎన్నడూ వివాదాలలో ఇరుక్కోలేదని ఆవేదన వ్యక్తం చేసారు మురళీమోహన్.
ADVERTISEMENT
ADVERTISEMENT



