
ఒకప్పుడు పీకే టీంలో ఐ ప్యాక్ ఒక భాగంగా ఉండేది. కానీ పీకే వ్యూహకర్తగా వ్యవహరించి ఏపీలో వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత పీకే టీం రెండుగా ముక్కలయ్యింది. ఐ ప్యాక్ గా ఒకటి పీకే టీంగా మరొకటి ఏపీ రాజధానుల మాదిరి ముక్కలయ్యాయి. ఒకరు నీలి రంగు అంటించుకుంటే మరొకరు అంటించుకున్న నీలి రంగుని తుడిచి పసుపు రంగు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకోస్తావా..? ఆ పక్క “హత్యా రాజకీయాలు” ఉన్నాయి ఈ పక్క “రాష్ట్ర రాజధాని భవిష్యత్” ఉంది అంటూ టీడీపీ ఫాల్లోవర్స్ సోషల్ మీడియాలో మీమ్స్ సిద్ధం చేశారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ పార్టీకి – పీకే కు మధ్య దూరం పెరుగుతూ వచ్చి చివరికి పీకే నే వైసీపీ ప్రభుత్వ విధానాల పై విమర్శలు చేసే స్థాయికి చేరింది. అయితే పీకే టీంలో ఉన్న ఐ ప్యాక్ టీం మాత్రం వైసీపీ పార్టీకి తన సేవలను కొనసాగిస్తూ వస్తుంది. తాజాగా చంద్రబాబు , ప్రశాంత్ కిషోర్ ల కలయికతో ఏపీ రాజకీయాలలో మరో కోణం ఆవిష్కృతమయ్యింది.
Also Read – గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!
వచ్చే ఎన్నికలకు టీడీపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే నియమించబడుతున్నాడు అంటూ వార్తలు చెక్కర్లు కొట్టడంతో అటు ఐ ప్యాక్ – ఇటు పీకే టీం ఇందులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ప్రజలు ఎగట్టున ఉంటారో అంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. అటు వైసీపీ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ స్టైల్ లో విమర్శలు మొదలుపెట్టారు. పీకే పై విమర్శలకు కొడాలి నాని, విడుదల రజని,అంబటి రాంబాబు,పేర్ని నాని ఇలా ఒక్కొక్కరు క్యూ కడుతున్నారు.
రానున్న వంద రోజుల సమయంలో పీకే ఎటువంటి వ్యూహాలతో ముందుకొచ్చి టీడీపీ విజయానికి బాటలు వేస్తారు అనే ఆసక్తి టీడీపీ అభిమానులలో మొదలైయింది. అలాగే ఐ ప్యాక్ టీంలు ఇచ్చే సర్వేలలో నిజానిజాలు ఎంతనేది కచ్చితంగా తెలిసిన పీకే కు తానూ అనుసరించాల్సిన పంధా ఏంటో కూడా ఇప్పటికే ఒక ఆలోచన వచ్చి ఉంటుందని ఆశపడుతున్నారు టీడీపీ శ్రేణులు.
Also Read – వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
అసలు పీకే కానీ టీడీపీ అధినాయకత్వం కానీ వారి కలియిక మీద పూర్తి స్పష్టత ఇవ్వనప్పటికీ అటు వైసీపీలో పీకే మీద విమర్శలు ఇటు టీడీపీ లో ఆశలు మొదలయ్యాయి. అలాగే వారిలో ఎవరి ప్రభావం ఎంత అనేదాని పై ఊహాగానాలకు అంతులేకుండా పోతుంది. ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైతే పీకే లు వచ్చినా,కోట్లు ఖర్చు పెట్టి ఐ ప్యాక్ టీంలను దింపినా ఓటమి ద్వారంలో అడుగు పెట్టాల్సిందే అనేది రాజకీయ చరిత్రను తిరగేస్తే అర్ధమవుతుంది.