
లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజ ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాస్పద వార్తలతో మీడియాలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 10 న రిలీజైన అజిత్ ‘గుడ్ బాడ్ అగ్లీ’ మూవీ లో ఇళయరాజా స్వరపరిచిన మూడు పాటలను తన అనుమతి తీసుకోకుండా వినియోగించారంటూ ఇళయరాజా ఈ మూవీ నిర్మాతలకు నోటీసులు పంపించారు.
ఇందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ కు 5 కోట్ల మేరకు తనకు పరిహారం అందించాలంటూ నోటీసు లో పేర్కొన్న ఇళయరాజా, తన అనుమతి లేకుండా ఈ మూవీ లో వాడిన ఆ పాటలను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేసారు.
Also Read – ప్రధాని పర్యటనపై వైసీపీ సైలంట్.. అంతేగా అంతేగా!
అయితే గతంలో కూడా సూపర్ హిట్ మూవీ గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రంలో కూడా ఇదే తరహాలో కొన్ని సందర్భాలలో ఇళయరాజ స్వరపరిచిన ‘గుణ’ సినిమాలోని పాటలను ఆ చిత్ర మేకర్స్ వినియోగించుకున్నారు.
అప్పుడు కూడా ఈ లెజండరీ సంగీత దర్శకుడు ఇదే మాదిరి తన అనుమతి లేకుండా సినిమాలో తన పాటలను వాడుకున్నందుకు గాను తనకు పరిహారం చెల్లించాలంటూ
ఆ చిత్ర యూనిట్ ని డిమాండ్ చేసి వార్తలలో నిలిచారు. ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ ను 5 కోట్లు డిమాండ్ చేస్తూ మరోమారు వార్తల్లోకెక్కారు ఇళయరాజా.
Also Read – పవన్ పై కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్…
అయినా చిత్ర నిర్మాతలు కూడా ఇటువంటి విషయాలలో కాస్త ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే సినిమా విడుదల తరువాత ఎటువంటి వివాదాలకు తావీయకుండా ఉంటుంది. మరి ఇళయరాజ డిమాండ్ చేస్తున్న మొత్తాన్ని పరిహారం గా చెల్లించి వివాదానికి ముగింపు పలుకుతారా.? లేక తన సినిమాలో వినియోగించిన ఇళయరాజా పాటలను తొలగిస్తారా అనేది మైత్రి సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.