యువరక్తం సత్తా చాటింది… సిరీస్ క్లీన్ స్వీప్..!

ODI, India, Zimbabwe, clean sweep, ODI series, Cricket, Zimbabwe vs India, 2016 News, ODI Match, Zimbabwe team, India Teamపాత కథే పునరావృతమైంది. జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ కు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ చిబాబా (27), సిబండ (37) రాణించడంతో జింబాబ్వే జట్టు 42.2 ఓవర్లలో 123 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో రాణించగా, చాహల్ రెండు, కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు.

కరుణ్ నాయర్ స్థానంలో చోటు దక్కించుకున్న ఫయాజ్ ఫజుల్ అరంగ్రేటం వన్డేలో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో రంగ ప్రవేశం చేసిన రాహుల్, ఫజల్ ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నారు. తొలుత ఆచి తూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా జోరు పెంచుతూ పోయారు. వీరిద్దరి ధాటికి టీమిండియా మూడో వన్డేలో పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో రాహుల్ 63 పరుగులు చేయగా, ఫజల్ 55 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 21.5 ఓవర్లలో 126 పరుగులు చేసింది.

ADVERTISEMENT

తొలి వన్డేలో సెంచరీ, మూడో వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన నేపధ్యంలో, ఇదే తరహాలో మూడు టీ 20లను కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేయాలని ఊవ్విళ్ళూరుతోంది. సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి, బి గ్రేడ్ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా విజయం సాధించడంతో సెలక్టర్లు కూడా రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories