ఇండియా ‘బుల్లెట్ ట్రైన్’ స్పెషాలిటిస్!

India Bullet Train - narendra modi shinzo abeముంబయి – అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర రైలు మార్గ నిర్మాణానికి భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది నవంబరులో మోడీ జపాన్ పర్యటనలో ఈ బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబంధించి 2017లో భూమి పూజ జరగగా, 2018 లో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుండటం గమనార్హం. దేశంలో మొదటిసారిగా పరుగులు పెట్టనున్న ఈ బుల్లెట్ రైలు విశేషాలు…

ADVERTISEMENT

508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండంటే రెండు గంటల్లో ఈ బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి. సామర్థ్యం 750 మంది. ప్రతి రోజు 36 వేల మందిని గమ్యానికి చేరుస్తుంది. 2053 నాటికి రోజూ 1.86 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రైలు పట్టాలెక్కాక ప్రస్తుతం అనుకుంటున్న పది కోచ్‌ లను 16 కోచ్‌లకు పెంచే ప్రణాళిక ఉంది. ప్రతి రోజు ఒకే దిశలో 35 బుల్లెట్ రైళ్లు ప్రయాణిస్తాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యవధి 5 ఏళ్లు. ఈ ఐదేళ్లలో నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.1.10 లక్షల కోట్లు.

ఏడాదికి 20 వేల కోట్లు చొప్పున 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా జపాన్ నుంచి 0.1 వడ్డీ రేటుతో 88 వేల కోట్లు రుణం తీసుకున్నారు. రైలు మార్గ నిర్మాణంలో 120 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వాడనున్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం కానుంది. 15 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించనున్నారు. 16 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. 4 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.
* 20 వేల మంది నిర్మాణ రంగ కార్మికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. గరిష్ట నిర్వహణ వేగం 320 కిలోమీటర్లు. రైలు మార్గంలో 21 కిలోమీటర్ల మేర టన్నెల్ ఉంది. ఇందులో సముద్రం అడుగు నుంచి (థానే క్రీక్) నుంచి ఏడు కిలోమీటర్లు ఉంది. ఇందు నిమిత్తం వడోదరలోని రైల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 4 వేల మందికి శిక్షణ ఇవ్వనుంది. దేశానికే తలమానికంగా ఉండాలని ఈ ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories