ఆ టైటిల్ ఏంటి… ఈ టీజర్ ఏంటి..!

Inttelligent--Teaserస్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “ఇంటిలిజెంట్” సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైంది. ‘నాయక్’ తరహాలో మరో మాస్ ఎంటర్టైనర్ ను వినాయక్ అందిస్తున్నట్లుగా టీజర్ స్పష్టం చేసింది. ‘ధర్మాభాయ్’ క్యారెక్టర్ లో సాయిధరమ్ తేజ్ ‘నాయక్’లోని రామ్ చరణ్ తేజ్ ను గుర్తుకు తెస్తున్నాడు. హీరో మార్పుతో ‘నాయక్’నే మళ్ళీ చూస్తున్నట్లుగా ఈ 52 సెకన్ల టీజర్ హింట్ ఇస్తోంది.

ADVERTISEMENT

అయితే ఈ సినిమాకు పెట్టిన టైటిల్ కు, చూపించిన విజువల్స్ కు ఏ మాత్రం పొంతన లేకపోవడం విశేషం. ‘ఇంటిలిజెంట్’ అంటే హీరో తనదైన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటాడని భావిస్తే, అందుకు విరుద్ధంగా మాస్ డైలాగ్స్, వీరోచితమైన ఫైట్లతో మెప్పించే ప్రయత్నం చేసాడు. బహుశా సినిమాలో ‘ఇంటిలిజెంట్’ అన్న టైటిల్ కు న్యాయం చేస్తారేమో గానీ, ఈ టీజర్ కు, టైటిల్ కు మాత్రం సంబంధం లేదు.

ADVERTISEMENT
Latest Stories