హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన జట్టు ఓటమి పాలు కావడం… అంచనాలు లేని టీం విజయం సాధించడం… ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సిద్ధాంతం. పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావితం చూపని మ్యాచ్ లో ఐపీఎల్ హాట్ ఫేవరేట్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ డేర్ డెవిల్స్ ఘనవిజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు, రెండవ స్థానంలో ఉన్న చెన్నైను ఓడించడం అనేది సాధారణ క్రికెట్ ప్రేమికులు అంచనాలు వేసింది కాదు. అది కూడా 163 పరుగులు చేధించలేక చతికిలపడడం!
కానీ అదే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. పంత్ 38, విజయ్ శంకర్ 36, హర్షత్ పటేల్ 36 పరుగులతో రాణించగా, ఓ మాదిరి లక్ష్య చేధనలో రాయుడు దూకుడుగా ఆడుతూ 29 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసాడు. దీంతో చెన్నై విజయం ఖాయం అనుకున్న తరుణంలో రాయుడు అవుట్ కాగా, రైనా, ధోనిలతో సహా మిగిలిన బ్యాట్స్ మెన్లంతా చేతులెత్తేసారు. దీంతో నిర్ణీత ఓవర్లలో కేవలం 128 పరుగులను మాత్రమే చెన్నై నమోదు చేయగలిగింది. ఫైనల్ గా “ఐపీఎల్ లో అంతే… ఐపీఎల్ లో అంతే…” అనుకోవడం షరామామూలే!



