అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం ఏర్పడటంతో ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. తమకు సంబందమే లేని ఆ యుద్ధానికి భారీగా మూల్యం చెల్లిస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచదేశాల సానుభూతి ఇరాన్‌కే లభిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో దాడులు చేస్తుంటే వాటిని అడ్డుకుంటున్నాఏ తప్ప ఏ ఒక్క దేశం ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధం కాకపోవడం ఇందుకు ఓ ఉదారణగా కనిపిస్తోంది.
హోర్మూజ్ జలసంధి తెరుచుకుంటే చమురు సంక్షోభం తగ్గుముఖం పడుతుంది. కనుక దానిని తెరిపించేందుకు సాయపడవలసిందిగా ట్రంప్ కోరితే అమెరికా మిత్రదేశాలు అంగీకరించకపోవడం మరో ఉదాహరణ.
ఈ యుద్ధం వలన చమురు, గ్యాస్ సంక్షోభం ఎదుర్కొంటున్న మిత్రదేశాలైన రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఇరాక్ కూడా ఇరాన్ వైపే ఉన్నాయి. కనుకనే ఓ పక్క అమెరికా-ఇజ్రాయెల్‌తో భీకర యుద్ధం చేస్తున్నా, హోర్మూజ్ జలసంధి ద్వారా మిత్రదేశాల చమురు, గ్యాస్, సరుకు రవాణా నౌకలను ఇరాన్ అనుమతిస్తోంది.
ప్రపంచంలో ఇంకా చాలా దేశాలు పట్ల సానుభూతి ఉంది. కానీ ట్రంప్‌కు భయపడి బహిరంగంగా మద్దతు తెలపడం లేదు అంతే!
కానీ ఇరాన్ వలన ప్రపంచ దేశాలు నష్టపోతున్నప్పటికీ దానికే సానుభూతి.. ఎందువల్ల?అంటే ఇది ఇరాన్ కోరుకున్న మొదలుపెట్టిన యుద్ధం కాదు గాబట్టి! అమెరికా-ఇజ్రాయెల్ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి కనుక!
ఆ దేశా సార్వభౌమత్వాన్ని గౌరవించకపోగా ఆ దేశాధ్యక్షుడుని, అయన కుటుంబాన్ని పవిత్ర రంజాన్ మాసంలో నిర్దాక్షిణ్యంగా చంపేశాయి గాబట్టి!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు అహంకారానికి ఇరాన్‌లోని సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారు గాబట్టి!
ఇరాన్ కేవలం తన దేశాన్ని, ప్రజలను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకే యుద్ధం చేస్తోంది గాబట్టి! ఇరాన్ స్థానంలో మరే దేశమున్నా అచ్చం ఇలాగే స్పందిస్తుంది గాబట్టి. మొన్న వెనుజువేలా, నేడు ఇరాన్, రేపు క్యూబా అంటున్న ట్రంప్ ఎల్లుండి తమ దేశంపై దాడి చేయకుండా ఉంటారా? అనే ఆలోచనతోనే ఈ యుద్ధంలో ట్రంప్ ఓడిపోవాలని, ఆయనకు తగిన శాస్తి జరగాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయనేది బహిరంగ రహస్యమే!




