పాటపై అంచనాలు పెంచిన రొమాంటిక్ పోస్టర్!

Iru Mugan Halena,Iru Mugan Halena Teaser,Iru Mugan Halena Teaser Release,Iru Mugan Halena Teaser Talk,Iru Mugan Halena Teaser Vikram,Iru Mugan Halena Talkకొన్ని పోస్టర్లు చూసిన వెంటనే వీక్షకులలో ఒక రకమైన అనుభూతులు కలుగుతాయి. అలాంటి అరుదైన పోస్టర్లలో ఒకటే ఈ “ఇరుముగన్” రొమాంటిక్ ఫోటో. గతంలో ఇదే లొకేషన్లో మరో రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేయగా, తాజాగా నయనతార – విక్రమ్ లు ముద్దుపెట్టుకునే విధంగా ఉన్న ఈ రొమాంటిక్ యాంగిల్ వీక్షకులను పడేసింది.

శనివారం నాడు విడుదల చేయబోతున్న ‘హలెనా’ పాట టీజర్ కు సంబంధించి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ వీక్షకులను ఊరిస్తోంది. అంతేకాదు, ఈ రొమాంటిక్ సాంగ్ ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి, అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఓ పక్కన సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, మరో పక్కన సుందరాంగి బొమ్మ సోయగాలు… ఇలా ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటే… కన్నుల పండుగ కాక ఇంకేముంటుంది..?

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories