అయోమయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్

Is agnyaathavaasi Pawan Kalyan last movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి చిత్రం ఆజ్ఞతవాసి మొదటి టీజర్ శనివారం విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ మేనియాలో అప్పటినుండి కొట్టుమిట్టాడుతున్నారు అభిమానులు. త్రివిక్రమ్ టేకింగ్, పవన్ కళ్యాణ్ మేనరిజం, నేపధ్య సంగీతం, అద్భుతమైన విజువల్స్ ఇలా అన్నిటితో అభిమానులకు విందుభోజనంలా ఉంది ఆ టీజర్.

ADVERTISEMENT

అయితే టీజర్ చూసాక అభిమానులలో కొత్త అయోమయం మొదలయ్యిందట. వారందరికీ తెలుసు ఈ చిత్రం పవన్ కళ్యాణ్ చివరి చిత్రాల్లో ఒకటని. ఇటువంటి స్టార్ ను మళ్లీ తెరపై చూడాలేము అని బాధ ఒక వైపు, తమ అభిమాన నటుడు రాజకీయాల్లో కూడా రాణించి సీఎంగా చూడాలని ఒకవైపు రెండు రకాలుగా ఉందట వారికి.

కొందరైతే ప్రజారాజ్యం జ్ఞాపకాలతో రాజకీయాలు మనకెందుకు అన్నయ్య చక్కగా సినిమాలు చేసుకుందాం అని పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ లో సలహాలు కూడా ఇచ్చేస్తున్నట. అయితే తన ప్రాధాన్యత ఏంటో ఈపాటికే చెప్పేసాడు పవన్ కళ్యాణ్. కాబట్టి వీలైనంతగా ఈ సినిమాను ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయిపోయారంట వారంతా!

ADVERTISEMENT
Latest Stories