
రాజధాని అమరావతి రైతుల త్యాగానికి వైసీపీ ఇచ్చిన గుర్తింపు భ్రమరావతి, కమరావతి కాగా సాక్షి ఇచ్చిన గౌరవం వేశ్యల నగరం, ముంపు ప్రాంతం….అసలు వైసీపీ డిఎన్ఏ కు రాష్ట్ర రాజధాని అమరావతి మీద ఎందుకంత ద్వేషం.?
కేవలం జగన్ ను విమర్శించారు, వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు అనే ఒకేఒక్క కారణంతో సొంత పార్టీ ఎంపీ ని చావు అంచులదాకా తీసుకెళ్లిన వైసీపీ రాజకీయాన్ని నాడు ఆంధ్రప్రదేశ్ కళ్లారా చూసింది. అలాగే సొంత పార్టీ క్యాడర్ తో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడులకు యత్నించిన జగన్ విధానాలను చెవులారా వినింది.
Also Read – వైసీపీలకి పవన్ వార్నింగ్… అబ్బే డోస్ సరిపోదు!
నాడు జరిగిన ఆ దారుణాలకు మద్దతు పలికిన సాక్షి, అండగా నిలబడిన వైసీపీ నేడు జరుగుతున్న నిరసనలను, అరెస్టులను తప్పుపట్టడం, ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం.? ఒక ప్రాంతాన్ని, అక్కడి ప్రాంత ప్రజలను ఉద్దేశించి సాక్షిలో జరిగిన చర్చతో మహిళల మనోభావాలు దెబ్బ తిన్నాయి, వారి ఆత్మగౌరవం చిన్న బోయింది అంటూ వారికొచ్చిన బీపీలతో సాక్షి మీడియా పై దాడి చెయ్యొచ్చా.?
రాజధాని పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డ కృష్ణంరాజు, కొమ్మినేని కి అరికాళ్ళ కోటింగ్ ఇవ్వొచ్చా.? వైసీపీ రాజకీయ ఆవిర్భావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం “బూతు పురాణాలు” గా మారితే ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జర్నలిజం “రోత రాజకీయం”గా మార్చనుందా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!
వైసీపీ రాజకీయం మొత్తం మహిళల ఆత్మగౌరవం దెబ్బ కొట్టేలా, వారి వ్యక్తిత్వం కించపరిచేలా మహిళల చుట్టే ఎందుకు సాగుతుంది. నాడు నారా భువనేశ్వరి ఉదంతం నుంచి కొణిదెల కుటుంబ మహిళల వరకు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల మహిళా నేతల నుంచి సొంత కుటుంబంలోని ఆడపడచుల వరకు ‘వైసీపీ రాజకీయం మొత్తం దుశ్యాసనుడి దుర్మార్గం’ లా కొనసాగుతూనే వస్తుంది.
సొంత చెల్లి పుట్టుక మీదే ప్రత్యేక కథనాలు నడిపిన సాక్షికి పక్కంటి మహిళలను గౌరవించాలి అనే కనీస సృహ వస్తుందా.? ఆస్తుల కోసం సొంత తల్లి మీద కేసులు పెట్టి కోర్టులకీడ్చిన జగన్ కు విలువలు ఉన్నట్టా.? నా అక్క చెల్లెమ్మలు అంటూ జగన్ పలికే పలుకులలో అమరావతి మహిళలు లేరా.?
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
ఒక ప్రాంతం తాలూకా విలువను దిగజార్చానికి ఇలా మహిళలను అడ్డుపెట్టుకుని సాక్షి చేస్తున్న నీచ రాజకీయం వైసీపీ భవిష్యత్ ను సర్వ నాశనం చెయ్యగలదు. ఐదు కోట్ల మంది భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన మా పై విశ్లేషకుల ముసుగులో, మీడియా మత్తులో వైసీపీ చేయిస్తున్న నీచ రాజకీయాన్ని మహిళలు కన్నీటితో ప్రశ్నిస్తున్నారు.
ఒక ఆడదాని కన్నీటి ఉసురుకి శ్రీ కృష్ణుడంతటోడే తలవంచాడు, అలాంటిది వైసీపీ, సాక్షి గత కొన్నేళ్లుగా ఎందరో మహిళల కన్నీటికి కారణమవుతున్నారు. వారి ఆ కన్నిటి ఉసురు వైసీపీ కి శాపంగా మారే 151 ఉన్న వైసీపీ కేవలం 11 కి పరిమితం అయ్యింది. అయినా వైసీపీ కి ఇంకా తత్త్వం బోధపడలేదు.
వైసీపీ అనుభవించాల్సిన మూల్యం ఇంకా మిగిలే ఉంది, దానికి సాక్షినే సాక్ష్యం అనేలా సాక్షి మీడియా హద్దులు దాటుతుంది. ఇన్నాళ్లు వైసీపీ సోషల్ మీడియాను మాత్రమే భ్రష్టు పట్టించింది అనుకుంటుంటే ఇప్పుడు తాజాగా సాక్షిలో జరిగిన ఈ రచ్చతో వైసీపీ ఉన్మాదం మెయిన్ స్ట్రామ్ మీడియాను కూడా తాకింది అనిపిస్తుంది.
అమరావతి వేశ్యల నగరం అయితే సాక్షి ఉన్మాదుల నిలయమా.? వైసీపీ హంతకుల కేంద్రమా.? జర్నలిస్టుల పేరుతో సాక్షిలో జరిగే రాజకీయం, డిబేట్ల రూపంలో వారు చేసే పైశాచికత్వం ఉన్మాదం కాదా.? డ్రైవర్ సుబ్రహ్మణ్యం నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు వరకు నిందితులంతా వైసీపీ పాఠశాల అభ్యర్థులే. అయితే వైసీపీ హంతకుల కేంద్రమని సాక్షి ఒప్పుకున్నట్టేనా.?
ఆంధ్రప్రదేశ్ మహిళలకు బీపీలు వచ్చి సాక్షి మీడియా మీద, వైసీపీ కార్యాలయాల మీద దాడులు చేయకముందే కూటమి ప్రభుత్వం ఈ ఉన్మాదుల పై కఠిన చర్యలు తీసుకుని మరో ఉన్మాది ఇటువంటి దుస్సాహసానికి పాల్పడకుండా కట్టడి చెయ్యాలి.