స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైఎస్సార్ కాంగ్రెస్ సహకరిస్తోందా?

Is YSR Congress supporting steel plant privatization?ఎపిలో ఒక కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది.

నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు ఇస్తున్నారు. మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 2,500 మంది, పరోక్షంగా 15వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా.

ADVERTISEMENT

ఈ క్రమంలో ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు కొత్త వాదన తెరపైకి తీసుకుని వస్తున్నాయి. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమిదని ఆరోపిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుంది. ఒకపక్క సహకరిస్తూనే ఈ విషయంగా కేంద్రం పై నిరసన తెలుపుతున్నట్టు నటిస్తుంది. చివరికి మేము గట్టిగా ప్రయత్నం చేశాం. కుదరలేదు కాబట్టి ఈ కొత్త స్టీల్ ప్లాంట్ తెస్తున్నాం అని చెప్పుకోవడానికి దీనిని తెర మీదకు తీసుకుని వచ్చారు అని వారు ఆరోపిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుండి స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసి సొంతంగా నడపాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త స్టీల్ ప్లాంట్ విషయంలో ఆరోపణల సంగతేమో గానీ… జీతాలు ఇవ్వడానికి కూడా సతమతం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ని కొనే సీన్ ఎక్కడిది?

ADVERTISEMENT
Latest Stories