
వైసీపీ రాజకీయ వ్యూహాలు (ప్రశాంత్ కిశోరె, ఐప్యాక్) కాస్టలీ గా ఉన్నప్పటికీ వారి పార్టీ రాజకీయ నినాదాలు మాత్రం చాల సిల్లీ గా అనిపిస్తుంటాయి. వాటిలో భాగంగా వైసీపీ…వై నాట్ 175 , 2024 జగనన్న వన్స్ మోర్, నువ్వే మా నమ్మకం జగనన్నా, వై నాట్ కుప్పం…ఇలా గత ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ ఇచ్చిన రాజకీయ నినాదాలు వారి పార్టీ ‘అతి విశ్వాసాన్ని’ బయటపెట్టాయి.
దీనితో, ఇక ఆ తరువాత వెలువడిన ఎన్నికల ఫలితాలు వైసీపీ పట్ల ప్రజలలో ఉన్న ‘అపనమ్మకాన్ని’ రుజువు చేసాయి. అయితే 151 నుంచి 11 కి పడిన వైసీపీ అవమానకర ఓటమిని ఆ పార్టీ నేతలు ఇప్పటికి అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే అదే అతి విశ్వాసం ప్రదర్శిస్తూ అవే తరహా నినాదాలు ఇస్తూ మరో మారు వైసీపీ తమ ‘అభద్రతా భావాన్ని’ వ్యక్తపరుస్తుంది.
Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!
తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ కూటమి మీద ప్రజలలో ఉన్న అసంతృత్తి బయటపడింది, ఇక 2029 లో వచ్చేదే వైసీపీ ప్రభుత్వమే, చచ్చేది టీడీపీ పార్టీనే అంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెపుతున్నారు. అయితే తిరిగి తమ పార్టీ అధికారంలోకి రావాలి అని ఆశ పడడం కానీ వస్తుంది అని పార్టీ క్యాడర్ కి ఆశ పెట్టడం కానీ తప్పుకాదు.
కానీ వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ పార్టీ ఉండదని, ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని అంబటి వంటి సీనియర్ రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించడం అది వారి అవివేకమే అవుతుంది. అలాగే వైసీపీ అధినేత వైస్ జగన్ ఈసారి వచ్చేది మనమే, మరో 30 ఏళ్ళు మన ప్రభుత్వమే, ఆ పై వైసీపీ నేతలను అరెస్టులు చేసి జైలుకి పంపుతున్న అధికారులను సప్త సముద్రాల వెనుక ఉన్నా లాకొస్తాం, గుడ్డలు ఊడతీస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?
అంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ వైసీపీ క్యాడర్ కు లీడర్లకు వైస్ జగన్ భరోసా ఇస్తున్నారా.? లేక 2029 లో నేనే సీఎం మీ సంగతి చూస్తా అంటూ అధికారులను బెదిరిస్తున్నారా.? లేక మరో ఐదేళ్ల తరువాత ఏపీలో వైసీపీ రాజ్యమేలుతుంది అనే సంకేతాలు ఇస్తూ పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను జగన్ భయపెట్టాలని భావిస్తున్నారా.? అసలు ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ వైసీపీ ప్రజలకు ఎం చెప్పాలనుకుంటుంది.?
ప్రభుత్వానికి ఏం హెచ్చరికలు పంపుతుంది.? ఈ రకమైన ప్రకటనలతో వైసీపీ ఏపీ ని అభివృద్ధికి ఆమెడ దూరంలో పెట్టి మరోసారి అంధకారంలోకి నెట్టాలనుకుతుందా.? నిజంగా మరోమారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా, ముఖ్యమంత్రిగా జగన్ పాలన మొదలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలాటకు వేదికవుతుంది. పారిశ్రామిక ప్రగతికి అందనంత దూరంలో ఉంటుంది.
Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?
అయితే గత పాలనలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుని, ఏపీ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వైసీపీ ఇటువంటి హెచ్చరిక ప్రకటనలను, 30 ఏళ్ళు మనదే ప్రభుత్వం, మనమే సీఎం అనే నినాదాలు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. లేదంటే 2024 తరహా అవమానాలకు వైసీపీ మరోమారు సిద్ధమా.? అంటూ నిందించాల్సి వస్తుంది.