టాలీవుడ్ లో కలకలం రేపిన ఘటన ఇది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత రాజీవ్ రెడ్డి, యువ హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సుధాకర్ రెడ్డి ఇళ్లలో, ఆఫీస్ లలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇటీవల విడుదలై, ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం విజయంపై వచ్చిన ఆదాయానికి సంబంధించిన లెక్కల కోసమే హైదరాబాద్ లోని వారి ఇళ్లలో ఐటీ అధికారులు దాడి చేసి ఉంటారని తెలుస్తోంది. కాగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పలు చిత్రాలను నిర్మించారు. తాజాగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తెలంగాణలో సుధాకర్ రెడ్డి పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే గౌతమీపుత్ర శాతకర్ణితో పోలిస్తే, మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. అంటే నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్ చిరంజీవి సినిమానేనా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సంక్రాంతికి విడుదలైన మరో సినిమా ‘శతమానం భవతి’ కూడా మంచి విజయం సాధించడంతో, దిల్ రాజుపైన కూడా ఈ సోదాలు ఉంటాయా? అన్న రీతిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



