Jagan Comes to Counseling and Goes to Bengaluru For What?

వైసీపీ ఘోర ఓటమి తరువాత గుంటూరు కారం సినిమాలో గుంటూరు టూ హైద్రాబాద్ డైలీ సర్వీస్ చేసే హీరో మహేష్ బాబు మాదిరి తాడేపల్లి టూ బెంగళూర్ డైలీ సర్వీస్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.

టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్త మీద దాడి చేసేసారు..రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పిపోయాయి, కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అంటూ చిందులు తొక్కుతూ బెంగళూర్ ప్యాలస్ నుండి తాడేపల్లి ప్యాలస్ కు చేరుకోవడం జగన్ దిన చర్యలో భాగమయ్యింది.

Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?

వైసీపీ ఓటమి తరువాత ఈ రెండు నెలలో జగన్ నాలుగుసార్లు బెంగళూర్ ప్యాలస్ టూ తాడేపల్లి ప్యాలస్ ల మధ్య నాలుగు పర్యటనలు సాగాయి. జగన్ బెంగళూర్ కు వెళ్ళడానికి కారణం చెప్పరు కానీ అక్కడి నుండి తాడేపల్లి కి రావడనికి మాత్రం ప్రతిసారి ఒకటే కారణం. అది టీడీపీ దౌర్జన్యానికి ఓదార్పు లేదా పరామర్శ.

వైసీపీ పార్టీ గెలిచి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఉన్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టలేదు. ఇప్పుడు ఓడినప్పుడు రాష్ట్రాన్ని వీడుతున్నారు కానీ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవడం లేదు. రాష్ట్రంలో ఎదో జరిగిపోతుంది, తనకు తన పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ కోర్ట్ మెట్లెక్కి రాష్ట్రంలో లేని అలజడిని సృష్టిస్తున్నారు.

Also Read – పాపం ఆవిడ ఇంకా ఎన్టీఆర్‌ దగ్గరే ఆగిపోయారు!

అసలు జగన్ రాష్ట్రాన్ని వీడగానే ఎవరొక వైసీపీ కార్యకర్త చనిపోయాడని లేదా టీడీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురయ్యాడని సాక్షిలో వార్తలు రావడం దాని మీద జగన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం, ఆ ఆతరువాత రెండు రోజులకు ఓదార్పు, పరామర్శ అంటూ జగన్ బెంగళూర్ నుండి విజయవాడ రావడం మళ్ళీ తిరిగి బెంగళూర్ వెళ్లిపోవడం ఇలా అన్ని “స్క్రిప్ట్ తన పని తాను చేసుకు పోతుందా” అన్నంతగా అన్ని కార్యక్రమాలు ఒక ఫ్లో లో క్రమం తప్పకుండా జరిగిపోతున్నాయి.

బాబాయ్ గొడ్డలి పోటును గుండె పాటుగా చిత్రీకరించిన సాక్షి కి ఈ తరహా వార్తలు సృష్టించడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. అలాగే కోడికత్తి తో జగన్ మీద హతయ్యత్నం, గులకరాయితో జగన్ ను అంతమొందించేందుకు ప్రణాళికలు అంటూ ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేసి రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించే సాక్షి ఇప్పుడు ఈ తరహా వార్తలను ప్రచారం చేస్తుంది.

Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!

ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా పోలీస్ ఉన్నతాధికారులు సైతం జగన్ ఆరోపిస్తున్న వాటికీ ఆధారాలు బయటపెట్టమంటున్నా దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. జగన్ దగ్గర ఆధారాలు లేవు. వ్యక్తిగత కక్ష్యలను రాజకీయ హత్యలుగా, కుటుంబ గొడవలను పార్టీ గొడవులుగా చిత్రీకరించి జగన్ మెల్లగా బెంగళూర్ జారుకుంటున్నారు. ఇక్కడ అలజడి సృష్టించి అక్కడ సేద తీరుతున్నారు జగన్.

అయితే గత ఐదేళ్లలో జగన్ దోచుకున్నదంతా దాచుకోవడానికి బెంగళూర్ యాత్రలు మొదలుపెట్టారంటూ అధికార పార్టీ నేతలు జగన్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ నుంచి పెద్దగా ప్రతిస్పందన రావడం లేదు. తాడేపల్లికి వచ్చిన ప్రతిసారి జగన్ బెంగళూర్ కు వెళ్ళడానికి కారణమేమిటి? ఏపీలో దొరకని భద్రతా జగన్ కు బెంగళూర్ లో దొరుకుతుందా? లేక బెంగళూర్ ప్యాలస్ చాటున జగన్ చక్కపెట్టాల్సిన రాజకీయ లెక్కలు ఏమైనా మిగిలిపోయాయి?

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రానని, భద్రత పెంచుకుంటే రాష్ట్రానికి రానని, రాజకీయాలకు సమయం లేదు కోర్టులకు రానని, బటన్ నొక్కాను గెలిపించలేదనే సాకులతో ప్రజా క్షేత్రంలో నిలబడి పోరాడలేక తప్పించుకోవడానికి దారులు వెతుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.




జగన్ ఎన్ని దారులు వెతుక్కున్నా చివరికి ఆయన కోసం ఖచ్చితంగా ఒక దారి ఎప్పటికి తలుపు తెరిచి ఎదురు చూస్తూనే ఉంటుందంటూ కౌంటర్ వేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరి జగన్ ఆ దారిలో అడుగేస్తే ఈసారి వైసీపీని భుజం కాయడానికి చెల్లి షర్మిల కూడా సిద్ధంగా లేరు కాబట్టి ఇక వైసీపీకి గోదారే దిక్కు సుమీ.