amaravati-farmers-jagan

జగన్‌ పిలుపు మేరకు రేపు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అన్నదాతలకు మద్దతుగా ధర్నాలు చేయబోతున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మద్దతు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారని, వారికి అండగా ఉద్యమిస్తున్నామని వైసీపీ సోషల్ మీడియాలో చెప్పుకుంది.

Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!

అయితే జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్‌కు కూతవేటు దూరంలో రాజధాని రైతులు టెంట్లు వేసుకొని దాదాపు నాలుగేళ్ళపాటు నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోలేదు. పైగా వారిపై అక్రమకేసులు బనాయించి వేధించింది.

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను జగన్‌ ప్రభుత్వం గౌరవించకపోయినా వారికి న్యాయం చేసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ వారు జీవనోపాది కోల్పోయి నానా ఇబ్బందులు పడుతుంటే, వారిపై పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించి వేధిస్తుండేది.

Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్‌ విశాఖపట్నమే!

వారు తిరుమల, బెజవాడ కనక దుర్గమ్మ, అరసవెల్లికి పాదయాత్ర చేయబోతే, వారిని పోలీసులతో అడ్డుకునేది. వారిపై కేసులు నమోదు చేయించింది. కోర్టుల చుట్టూ తిప్పించింది. రాజధాని రైతులలో మహిళలు, వృద్ధులు ఉన్నారనే ఇంగితం కూడా లేకుండా వైసీపీ శ్రేణులు వారిపై దాడులు చేశారు.

అప్పుడు వారిని జగన్‌ అన్నదాతలుగా భావించలేదు. కానీ ఇప్పుడు ‘అన్నదాతలకు ఎంత కష్టమొచ్చిందీ?” అంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతూ వారి కోసం వైసీపీ నేతలు పోరాడేందుకు బయలుదేరుతున్నారు!

Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!


ఇప్పుడైనా వారి పేరుతో కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ రాజకీయాలు చేయాలనే వైసీపీ ప్రయత్నిస్తోంది తప్ప రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ది ఉందని కాదు. కనుక వైసీపీ శ్రేణులతో కలిసి రైతులు పోరాడటం కాదు.. ఈ సందర్భంగా వారే వైసీపీ నేతలను నిలదీసి అడగాలి.