నెలలుగా అత్త సొమ్ముని అల్లుడు దానం చేసిన్నట్లు ప్రజల సొమ్ముని జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా వాలంటీర్లకు దానం చేస్తూనే ఉంది. వారి జీతాలకు వందల కోట్లు, సాక్షి పేపర్ కొనుక్కోవడం కోసం మరికొన్ని కోట్లు, ఏటా అవార్డుల పేరుతో వందల కోట్లు దానం చేస్తూనే ఉన్నారు.
వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కారు. కనీసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్దత కూడా లేదు. వారందరూ వైసీపి కోసమే పనిచేస్తున్నారని తమకు విధేయంగా ఉండాలని స్వయంగా మంత్రులే చెప్పుకుంటారు. లక్షల మంది వాలంటీర్లే నా (ప్రైవేట్) సైన్యమని సాక్షాత్ సిఎం జగన్ చెప్పుకుంటారు.
కనుక వారికి ప్రజాధనం నుంచి జీతాలు చెల్లిస్తుండతమే ఓ తప్పు. మళ్ళీ వారికి సాక్షి పేపర్ కొనుక్కోవడానికి నెలకు రూ.200 చొప్పున అదనంగా ఇవ్వడం మరో పెద్ద తప్పు. ఇది ‘క్విడ్ ప్రో పద్దతిలో సాక్షి పేపర్ సేల్స్ పెంచుకోవడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వాలంటీర్లపై చేసిన సంచలన ఆరోపణలను కూడా జగన్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా నేడు 2.55 లక్షల మంది వాలంటీర్లకు అవార్డుల పేరుతో ఏకంగా రూ.392 కోట్లు జగన్ పంచిపెట్టేయబోతున్నారు. అంతే కాదు.. ఈ కార్యక్రమం గురించి కోట్లు ఖర్చు చేసి పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చుకుంటున్నారు!
ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల కమీషన్ చెపుతున్నప్పటికీ వారి సాయం తప్పక తీసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికలలో వైసీపి అభ్యర్ధులకు వారి సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ తమ జీతాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనలు చేయడంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారిని సంతృప్తి పరిచేందుకు నేడు అవార్డుల పేరుతో రూ.392 కోట్లు జగన్మోహన్ రెడ్డి ముట్టజెప్పబోతున్నారు.
అంతేకాదు… ఈ అవార్డుల సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం భారీగా పెంచేసి పంచిపెట్టబోతోంది. గత మూడేళ్ళుగా రూ.10 వేలు, 20 వేలు,30 వేలు చొప్పున నగదు పురస్కారాలు ఇస్తోంది. వాటిని ఈసారి రూ.15 వేలు, 30 వేలు, 45 వేలుకి పెంచి ఇవ్వబోతోంది. అంటే వారికి జీతాలు పెంచకపోయినా జగన్ ప్రభుత్వం ఈవిదంగా ‘కాంపన్‌సేట్’ చేస్తోందన్న మాట!
సిఎం జగన్ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి నియోజకవర్గంలో వాలంటీర్లకు నగదు బహుమతులు, ప్రశంశా పత్రాలు అందజేస్తారు.
వైసీపి కోసం వాలంటీర్లను ఉపయోగించుకుంటూ వారికి ప్రజాధనం నుంచి జీతాలు, న్యూస్ పేపర్ ఖర్చులు, ఈ నగదు పురస్కారాలు అందించడం అత్త సొమ్ముని అల్లుడు దానం చేయడమే. ఇది మరో పెద్ద ‘క్విడ్ ప్రో’ కూడా అంటే కాదనగలమా?




