జగన్ వర్తమానం…వైసీపీ భవిష్యత్ శూన్యమా.?

YS Jagan

2019 వైసీపీ గెలుపు, జగన్ భవిష్యత్ ను ఎలా దెబ్బ కొట్టిందో 2024 ఎన్నికలలో దేశం మొత్తం కళ్లారా చూసింది, చెవులారా వినింది.151 సీట్ల అఖండ మెజారిటీ తో అధికారం చేపట్టిన వైసీపీ, ఎన్నో అంచనాలతో, రాజన్న రాజ్య స్థాపన లక్ష్యాలతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైస్ జగన్ నాటి వర్తమానం వైసీపీకి 11 సీట్ల భవిష్యత్ ను కానుకగా అందించింది.

ఇంతటి దారుణ పరాభవాన్ని కూడా విశ్లేషణ చేసుకొని జగన్ తన వర్తమాన రాజకీయాలతో వైసీపీ భవిష్యత్ ను శూన్యం చేస్తున్నారా అన్న సంకేతాలు వైసీపీ సానుభూతిపరులను కూడా వేధిస్తున్నాయి.

ADVERTISEMENT

2024 వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని సరిచేసుకుని తిరిగి ప్రజలకు ఆమోదయోగ్యమయ్యే విధానాలతో ముందుకు రావాల్సిన జగన్ ఇప్పుడు కూడా అదే విధ్వంశకర పోకడలతో అడుగులేస్తూ వైసీపీ భవిష్యత్ ను అంధకారంలోకి నెడుతున్నారు.

నాడు రాష్ట్ర రాజధాని అమరావతి మార్పు అంటూ అంటూ వైసీపీ ఆడిన మూడు ముక్కలాటను జగన్ ఇప్పటికి సరిచేసుకోలేదు. రాజధాని అమరావతి పై జగన్ ఇప్పటికి అదే తరహా రాజకీయం చేస్తూ వైసీపీ సమాధికి గొయ్య తీస్తున్నారు.

ఇక జగన్ హయాంలో హద్దులు దాటిన వైసీపీ సోషల్ మీడియా అరాచకాల నియంత్రణలోనూ జగన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికి వైసీపీ సోషల్ మీడియా మొత్తం బూతు పురాణమే, గబ్బు రాజకీయాలే, అసత్య ప్రచారాలే అన్నట్టుగా సాగుతున్నాయి.

ఇక వైసీపీ అందగాళ్ళు, సౌమ్యులు సంఖ్య అయితే నానాటికి పెరుగుతుందే కానీ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నాడు నా పార్టీ కార్యకర్తలకు బీపీలు వస్తే ప్రత్యర్థి పార్టీల కార్యాలయాల మీద దాడులు చేస్తారు అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విధ్వంసానికి వెన్నెముకగా నిలిచిన జగన్,

నేడు గంజాయి ముఠాలకు, అరాచక శక్తులకు, రౌడీ షీటర్లకు మద్దతుగా పరామర్శ యాత్రలు చేస్తూ జగన్ 2.0 పాలనకు జస్ట్ శాంపిల్ వర్షన్ చూపిస్తున్నారు. ఇక గత ఐదేళ్ల వైసీపీ అరాచకాలకు బలవుతున్న వైసీపీ నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అందరు ఇప్పుడు జగన్ బాధితులుగానే జైల్లో బైలు కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ విషయంలో కూడా జగన్ ఇప్పటికి జరిగిన తప్పేంటో, జరగాల్సిన న్యాయం ఏమిటో ఆలోచించకుండా కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలను సృష్టించే రాజకీయానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

వైసీపీ ఓటమికి జగన్ తిరస్కరణకు కారణాలు వెతకాల్సిన జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, పోలీసుల బట్టలూడతీస్తా, వడ్డీతో సహా చెల్లిస్తా, జగన్ 2.0 చూపిస్తా, ప్రతి ఒక్కడి లెక్క తెలుస్తా అంటూ బెదిరింపు రాజకీయాలు మొదలుపెట్టారు.

ఇప్పటికే జగన్ రాజకీయానికి ఎంతోమంది వైసీపీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టుకున్నారు. అయినా జగన్ రాజకీయ వర్షన్ లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.

జగన్ చేస్తున్న వర్తమాన రాజకీయం వైసీపీ భవిష్యత్ ను శూన్యంలో, వైసీపీ రాజకీయ నాయకుల భవిష్యత్ ను అంధకారంలో నెట్టే ప్రమాదం లేకపోలేదు. రాజధాని విషయంలో, పాలన విధానాల అంశంలో జగన్ తీరు మార్చుకోకపోతే వైసీపీ ని నమ్మి రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెట్టేందుకు ఏపీ భవిష్యత్ తరం సిద్ధంగా ఉండలేదు అనేది ముమ్మాటికీ వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories