ఆ పేరిట ఈ పేరిట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాలు రాస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే నాలుగైదు ఉత్తరాలు రాశారు ఆయన. తాజాగా పేదలందరికీ ఇళ్లు స్కీం కింద గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో మౌలిక వసతులు కోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి.
ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రభుత్వం ఏమీ విదల్చదు అని తెలిసినా కూడా ఒక లేఖ రాసేశారు ముఖ్యమంత్రి. గతంలో వ్యాక్సిన్ ల గురించి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి.
జగన్ తో సహా దేశంలోని ఏ ముఖ్యమంత్రి సలహాలు తీసుకుని స్థితిలో లేరు మోడీ. రెండో సారి అఖండ విజయం మత్తులో ఉన్న వారికి ఎవరూ కనిపించరు. గతంలో ఎన్డీయేలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికే సహకరించని వారు జగన్ కు సహకరించడం అనేది జరగదు. అయినా జగన్ ఎందుకనో ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు.
ఇటువంటి ఉత్తరాల వల్ల జగన్ తమకు విధేయుడిగానే ఉంటున్నాడు అనే ఫీలింగ్ మోడీ – అమిత్ షాల కలిగించాలని ఆరాటపడుతున్నారా? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొందరు కేంద్రం సహకారం లేక చాలా చెయ్యలేకపోతున్నాం అని ఎన్నికల సమయంలో చెప్పుకోవడానికి గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా అనే అనుమాన పడుతున్నారు.