
సాధారణంగా భక్తులు దేవుడి స్తోత్రాలు చదువుతూ కటాక్షం కోసం ప్రయత్నిస్తారు. కానీ వైసీపీ అధినేత జగన్ తనని కలిసేందుకు వచ్చిన వైసీపీ నేతల ఎదుట తనను తానే పొగుడుకుంటూ, ప్రమోట్ చేసుకుంటూ, జగన్ స్తోత్రాలు వినిపిస్తూ వారి చేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడుతుంటారు.
వారానికోసారి సమావేశాల పేరుతో అందరినీ పిలిపించుకొని ఈ హైప్ చేసుకోవడం చాలా అవసరం లేకుంటే ప్యాలస్‌లో ఒంటరితనం భరించడం కష్టం. ఈరోజు కూడా అదే చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులను తాడేపల్లి ప్యాలస్‌కి పిలిపించుకుని ప్రస్తుతం జగన్ తన స్తోత్ర పాటాలు వారికి వినిపిస్తున్నారు.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయడమే అని చెప్పిన జగన్ ఇవాళ్ళ మరో కొత్త కారణం చెప్పారు. మీ ఈ జగన్‌కి అబద్దాలు చెప్పడం చాతకాదు. నేను అబద్దాలు చెప్పలేకపోవడం వల్లనే మనం ఓడిపోయాము.
ఇదివరకు మనకి 50 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఈసారి 40 శాతం వచ్చింది. ఎందువల్ల అంటే ఇదే కారణం. నిజానికి గతంలో కంటే ఈసారి మరో 10 శాతం ఓట్ షేర్ పెరుగుతుందని అనుకున్నాను. కానీ మీ ఈ జగన్ అబద్దాలు చెప్పలేకపోవడం వల్లనే మన ఓట్ షేర్ పడిపోయింది,” అని చెప్పారు.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
దీని తర్వాత స్తోత్రంలో విలువలు, విశ్వసనీయత, ముప్పై ఏళ్ళు నేనేతో మొదలుపెట్టి సంక్షేమ పధకాలతో కొనసాగిస్తున్నారు.
దాదాపు 8 నెలలుగా మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతూ కాలక్షేపం చేస్తున్న జగన్, టీడీపీ కార్యకర్తలు ఎవరూ ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారని కనిపెట్టి చెప్పారు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
ఎంత యాక్షన్ సినిమా అయినా మద్యలో నాలుగు ఫారిన్ పాటలు, నాలుగు కామెడీ స్కిట్స్, పంచ్ డైలాగులు తప్పక ఉంటాయి. లేకుంటే ప్రేక్షకులు లేచి వెళ్లిపోతారు.
ఒకవేళ హాస్య నటులు పక్కన లేకపోతే హీరోలే కామెడీ చేసి అందరినీ అలరించిన్నట్లే, జగన్ కూడా మద్యలో నా పదహైదు వేలు ఏమయ్యాయ్యి.. అంటూ ఓ నాలుగైదుసార్లు అంటూ స్తోత్రాలు వినేందుకు వచ్చిన వారిని కాసేపు నవ్వించి చప్పట్లు కొట్టించుకుంటారు.
వారు కాస్త తేరుకోగానే “నేను లేని ఈ రాష్ట్రం ఎలా భ్రష్టు పట్టిపోతోందో.. నా సంక్షేమ పధకాలు అందక ప్రజలు ఎంతగా విలవిలలాడిపోతున్నారో…” అంటూ విషాద సన్నివేశం రక్తి కట్టిస్తారు.
చివరిగా దీనికి ఏకైక పరిష్కారం నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కావడమే.. అయితే మరో ముప్పై ఏళ్ళు మీకు ఏ దిగులూ ఉండదు,” అని చెప్పి చప్పట్లు కొట్టించుకోవడంతో సమావేశం అనబడే స్తోత్ర పాఠాలు పూర్తవుతాయి.
మళ్ళీ వారం గ్యాప్ తర్వాత మరో బ్యాచ్‌ని తాడేపల్లి ప్యాలస్‌కి పిలిపించుకుంటారు. మళ్ళీ సేమ్ సాంగ్.. చప్పట్లు.. మామూలే.
జగన్ ఈవిదంగా కాలక్షేపం చేస్తూ, నేనే ముఖ్యమంత్రిని అవుతాను.. ముప్పై ఏళ్ళు నేనే అని సంతోషపడుతుంటే, కూటమి ప్రభుత్వానికి, పార్టీలకు ఇంతకంటే ఏం కావాలి?