
అవును సిఎం చంద్రబాబు నాయుడు చేయలేకపోయిన కొన్ని పనులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకి, వైసీపీ నేతల నోటికి బలైనవారిలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చన్నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో సహా చాలా మంది ఉన్నారు.
చంద్రబాబు నాయుడుని, ఆయన సతీమణిని అవమానించడమే కాకుండా ఆయనని జైల్లో పెట్టి టపాకాయలు కాల్చి పైశాచికానందం అనుభవించారు కూడా.
Also Read – జగన్ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని
కనుక తమపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న టీడీపీ, జనసేనలు అధికారంలోకి రాగానే తమ తాట తీస్తాయని వైసీపీ నేతలు భయపడ్డారు. ఆ భయంతోనే మాజీ మంత్రి రోజా కొన్ని నెలలు తిరుమల వెళ్ళడం కూడా మానుకున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 8 నెలలు పూర్తయింది. వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేయడమే తప్ప తమని వేధించిన ఏ సీనియర్ వైసీపీ నాయకుడిని కూటమి ప్రభుత్వం ఇంతవరకు టచ్ చేయలేకపోతోంది.
Also Read – మీరు ఎమ్మెల్యేలయ్యా… దొంగలుకారు!
గోదాములలో బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై విచారణ అంటూ హడావుడి చేసి తర్వాత చల్లబడిపోవడం ఓ చిన్న ఉదాహరణగా భావించవచ్చు.
సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే తమపట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తుండటంతో వైసీపీలో మళ్ళీ అందరికీ ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు అందరూ సిఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెడుతున్నారు.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
సిఎం చంద్రబాబు నాయుడు ఏ కారణం చేత వారిని ఉపేక్షిస్తున్నప్పటికీ, ఆయన చేయలేకపోయిన ఈ పనిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా పూర్తి చేస్తున్నారు.
పార్టీలో ఇప్పటికే సజ్జల, అంబటి వంటి సీనియర్లను పక్కన పడేసి వారి స్థానంలో వేరొకరిని నియమిస్తున్నారు. బాలినేని, విజయసాయి రెడ్డి వంటి కొందరిని పొగబెట్టి బయటకు పారిపోయేలా చేశారు.
తాజాగా మాజీ మంత్రి రోజాకి పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చక్రం తిప్పి దివంగత మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్‌ని వైసీపీలో చేర్పిస్తున్నారు. నగరి నియోజకవర్గం వైసీపీ బాధ్యతల నుంచి రోజాని తప్పించి, గాలి జగదీష్‌కి అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది.
కనుక టీడీపీ, జనసేనలని వేధించినవారిని సిఎం చంద్రబాబు నాయుడు ఉపేక్షిస్తున్నా జగన్ మాత్రం ఉపేక్షించడం లేదు. ఒక్కొక్కరినీ ఏరి పారేస్తున్నారు. ఇందుకు టీడీపీ, జనసేన నేతలు జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా?