వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి నవంబరు 6 నుంచి చేపట్టనున్న పాదయాత్ర రూట్‌మ్యాప్ సిద్ధమైంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభించనున్న జగన్ అక్కడ నుంచి జిల్లాలో 100కి.మీ. నడవనున్నారు. మైదుకూరు మీదుగా ఆళ్లగడ్డ వద్ద కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు.
ఆ జిల్లాలో 230కి.మీల మేర యాత్ర కొనసాగనుంది, తర్వాత అనంతపురం జిల్లాకు వెళతారు. అక్కడ 220కి.మీ. మేర పాదయాత్ర చేశాక కదిరి మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఆ జిల్లాలో 210కి.మీ.లు నడవనున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో సుమారు 760కి.మీ.ల మేర యాత్ర సాగనుంది.
రోజుకు సగటున 15-20 కి.మీ. నడుస్తారన్న అంచనాతో మార్గసూచీని సిద్ధం చేశారు. అక్కడ నుంచి నెల్లూరు, తర్వాత ప్రకాశం జిల్లాలో యాత్ర కొనసాగనుంది. మొత్తం మీద 3200 కిలోమీటర్లు ఆయన నడవనున్నారు. వేసవి కాలం ఎండలు ఎక్కువ కాక ముందే మే 2 కల్లా మొత్తం పాదయాత్ర పూర్తి చెయ్యాలని టార్గెట్.


