
అమెరికాకు చెందిన టెస్లా కార్లు తయారుచేసే కంపెనీ భారత్‌లో ఎలెక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగానే, దానిని తమ రాష్ట్రానికి తెచ్చుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ పడుతోంది.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
ఆయా రాష్ట్రాలలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ఎల్లప్పుడూ నిలకడైన విధానాలతో సాగుతుండటంతో అవి ఏపీ కంటే చాలా ముందున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాలలో ఇప్పటికే అనేక వాహనాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణకు అన్ని విదాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం, దాని నిండా అనేక రకాల పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలకు ఇన్ని సానుకూలతలు ఉన్నాయి. మరి ఏపీకి?
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
ఆంధ్రప్రదేశ్ కధ అందరికీ తెలిసిందే. రవాణా రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటితో పోటీ పడుతోంది గానీ వాహనాల తయారీరంగంలో గట్టిగా చెప్పుకోవడానికి ఒక్క ‘కియా’ మాత్రమే కనిపిస్తోంది. అది కూడా వైసీపీ నేతల ధాటికి వెళ్ళిపోయేదే కానీ చివరి నిమిషంలో జగన్ వెనక్కు తగ్గడంతో నిలబడింది.
రాష్ట్రంలో పరిశ్రమలు లేకపోతే ఎలాగో కష్టపడి తెచ్చుకోవచ్చు. కానీ ఓ పక్క అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడి టెస్లా సాధించుకోవడమే కష్టమనుకుంటే, ‘జగన్ ఫోబియా’తో భయపడుతున్న పరిశ్రమలకు నచ్చజెప్పడం, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాటికి, వారి పెట్టుబడులకు నష్టం జరగదని భరోసా కల్పించడం ఇంకా కష్టం.
Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..
‘2029 తర్వాత మళ్ళీ నేనే ముఖ్యమంత్రినవుతా.. 30 ఏళ్ళు నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని” అంటూ జగన్ పదేపదే చెపుతున్న మాటలు ఏపీ అభివృద్ధికి శాపంగా మారుతున్నాయి.
అయినప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు టెస్లాని సాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకి రాష్ట్రంలో మూడు జిల్లాలలో కీలకమైన ప్రాంతాలలో భూమి కేటాయిస్తామని చెప్పారు.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో లేదా శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా ప్లాంట్ సమీపంలో లేదా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సమీపంలో భూములు సిద్దంగా ఉన్నాయని తెలియజేశారు.
కానీ టెస్లాని సాధించుకోవడానికి ఇతర రాష్ట్రాలు కూడా కీలకమైన ప్రాంతాలలో భూములు కేటాయించడానికి సిద్దంగా ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలలో ‘జగన్ ఫోబియా’ ఉండదు. ఏపీలో ఉంటుంది! ఈ ఒక్క తేడాయే వాటికి వరంగా ఏపీకి శాపంగా మారింది.
కనుక పెట్టుబడులకు, ఐటి కంపెనీలకు, పారిశ్రామికాభివృద్ధికి అవరోధంగా ఉన్న ‘జగన్ ఫోబియా’ నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తే తప్ప చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించవు.
ఈ నేపధ్యంలో కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పి టెస్లాని తీసుకురాగలిగితే తప్పకుండా అది ఘనకార్యంగానే భావించవచ్చు.